టీమిండియాలో ఆ రెండు స్థానాలు ఎప్పటికీ భర్తీ చేయలేరు: కపిల్‌ దేవ్‌

Kapil Dev, Team India, Virat Kohli, Rohit Sharma: భారత క్రికెట్‌ జట్టులో ఓ ఇద్దరి ప్లేస్‌లు అస్సలు భర్తీ చేయడానికి అవకాశమే లేదని, భవిష్యత్తులో కూడా మరే క్రికెటర్‌ కూడా వారిని రీప్లేస్‌ చేయలేడంటూ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ ఇద్దరి ఎవరో ఇప్పుడు చూద్దాం..

Kapil Dev, Team India, Virat Kohli, Rohit Sharma: భారత క్రికెట్‌ జట్టులో ఓ ఇద్దరి ప్లేస్‌లు అస్సలు భర్తీ చేయడానికి అవకాశమే లేదని, భవిష్యత్తులో కూడా మరే క్రికెటర్‌ కూడా వారిని రీప్లేస్‌ చేయలేడంటూ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ ఇద్దరి ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, 1983లో భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో ఓ రెండు స్థానాలు ఎప్పటికీ భర్తీ కావంటూ పేర్కొన్నారు. అలాగే ఆ ఇద్దరు ఆటగాళ్లను రీప్లేస్‌ చేసే ఆటగాళ్లు కూడా వచ్చే అవకాశం లేదంటూ వెల్లడించాడు. సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని స్థానాలు ఎలాగైతే అన్‌ ఫిల్డ్‌గా ఉండిపోయాయో ఇప్పుడు.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలను కూడా టీ20 ఫార్మాట్‌లో ఎవరూ ఎప్పటికీ రీప్లేస్‌ చేయలేరని అన్నారు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. చాలా కాలంగా కోహ్లీ, రోహిత్‌ శర్మ భారత క్రికెట్‌పై తమ ముద్ర వేశారు. ఎన్నో మ్యాచ్‌లను టీమిండియాను ఒంటిచేత్తో గెలిపిస్తూ.. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను నంబర్‌ వన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ, రోహిత్‌ స్థానాలను భర్తీ చేసే భాగంలో బీసీసీఐ యంగ్‌ క్రికెటర్లకు అవకాశాలు ఇస్తోంది. తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో శుబ్‌‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లను టాప్ ఆర్డర్‌లో ఆడించింది. అందరూ నిలకడగానే పరుగులు సాధించారు. కానీ, కోహ్లీ, రోహిత్‌లా కొన్ని ఏళ్ల పాటు అదే కన్సిస్టెన్సీతో బ్యాటింగ్‌ చేస్తారా అంటే అనుమానమే.

ఈ క్రమంలోనే కపిల్‌ దేవ్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘టీ20 అనే కాదు ఫార్మాట్‌ ఏదైనా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ‌ను రీప్లేస్‌ చేయలేరు. ఇండియన్‌ క్రికెట్‌కు వారెంతో సేవలు అందించారు. టీ20ల్లో వాళ్లకు మంచి ముగింపు దక్కింది. అన్ని ఫార్మాట్లలో కోహ్లి తన సత్తా చాటాడు. టీ20 ఫార్మాట్‌లో అయితే కోహ్లీని కచ్చితంగా మిస్‌ అవుతాం. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల స్థానాలను టీమిండియాలో ఎలా అయితే భర్తీ చేయలేకపోయారో ఇప్పుడు కోహ్లి, రోహిత్ శర్మ స్థానాలను కూడా ఎప్పటికీ భర్త చేయలేం’ అంటూ కపిల్‌ వెల్లడించాడు. . వాళ్లను ఇతరులతో భర్తీ చేయలేం” అని కపిల్ దేవ్ అన్నాడు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments