విరాట్‌ కోహ్లీని చూసి నేర్చుకో..! స్టార్‌ ప్లేయర్‌కు మాజీ క్రికెటర్‌ సలహా

Kane Williamson, Virat Kohli, Michael Vaughan, T20 World Cup 2024: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని చూసి.. ఆ విషయంలో మెరుగుపడాలంటూ ఓ స్టార్‌ క్రికెటర్‌కు ఓ మాజీ క్రికెటర్‌ సలహా ఇచ్చాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Kane Williamson, Virat Kohli, Michael Vaughan, T20 World Cup 2024: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని చూసి.. ఆ విషయంలో మెరుగుపడాలంటూ ఓ స్టార్‌ క్రికెటర్‌కు ఓ మాజీ క్రికెటర్‌ సలహా ఇచ్చాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో కొంతమంది స్టార్‌ ఆటగాళ్లు దారుణంగా విఫలం అవుతున్నారు. అందులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఉన్నాడు. గ్రూప్‌ స్టేజ్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కోహ్లీ చేసిన పరుగులు వరుసగా.. 1, 4, 0. ఇవి కూడా ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, యూఎస్‌ఏ జట్లపై చేసినవి. కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ కూడా అంత బాగా ఆడటం లేదు. అలాగే న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, తెలుగు క్రికెట్‌ అభిమానులకు కేన్‌ మామగా సుపరిచితమైన విలియమ్సన్‌ ఈ వరల్డ్‌ కప్‌లో దారుణంగా విఫలం అయ్యాడు.

న్యూజిలాండ్‌ చెత్త ప్రదర్శనతో ఈ టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. టీ20 క్రికెట్‌లో చరిత్రలో న్యూజిలాండ్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటికి రావడం ఇదే తొలిసారి. అయితే.. న్యూజిలాండ్‌ వైఫల్యానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఆ జట్టు కెప్టెన్‌ అయిన విలియమ్సన్‌ ఫెల్యూర్‌ కూడా కారణంగా నిలిచింది. ముఖ్యంగా కేన్‌ విలియమ్సన్‌ స్ట్రైక్‌రేట్‌పై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ మాట్లాడుతూ.. కేన్‌ విలియమ్సన్‌, విరాట్‌ కోహ్లీని చూసి నేర్చుకోవాలని అన్నాడు.

అతను మాట్లాడుతూ..‘కేన్ విలియమ్సన్‌ 200 స్ట్రైక్‌రేట్‌తో ఆడే ప్లేయర్‌ అవుతాడని నేను అనుకోవడం లేదు.. కానీ, ఐపీఎల్‌ 2024లో విరాట్ కోహ్లీని చూడండి, ఈ సీజన్‌ కంటే స్ట్రైక్‌రేట్‌ విజయంలో కాస్త ఇబ్బంది పడిన కోహ్లీ.. తర్వాత పుంజుకుని.. 2024లో మోడ్రన్‌ క్రికెటర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా స్పిన్‌ను అద్భుతంగా ఆడుతూ.. ఎక్కువ పరుగులు చేశాడు. స్పిన్‌ను ఎదుర్కొవడానికి ల్యాప్ స్లాగ్ షాట్‌లు ఆడాడు. ఇప్పుడు కేన్‌ విలియమ్సన్‌ను కోహ్లీని చూసి.. తన స్ట్రైక్‌రేట్‌ను ఒక 15 శాతం వరకు పెంచుకోగలడేమో చూడాలి’ అంటూ వాన్‌ పేర్కొన్నాడు. మరి కేన్‌ మామ విషయంలో మైఖేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments