iDreamPost
android-app
ios-app

మూడోసారి తండ్రైన స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!

  • Published Feb 28, 2024 | 9:06 AM Updated Updated Feb 28, 2024 | 9:06 AM

స్టార్ క్రికెటర్ ముచ్చటగా మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్లేయరే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

స్టార్ క్రికెటర్ ముచ్చటగా మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్లేయరే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

  • Published Feb 28, 2024 | 9:06 AMUpdated Feb 28, 2024 | 9:06 AM
మూడోసారి తండ్రైన స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!

ఓ స్టార్ క్రికెటర్ ముచ్చటగా మూడోసారి తండ్రైయ్యాడు. అతడి భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం ఆ స్టార్ ప్లేయర్ భీకరఫామ్ లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. రికార్డులు కొల్లగొడుతున్నాడు. మరి మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తాజాగా కేన్ మామ భార్య సారా రహీం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన చిట్టితల్లిని ఒడిలో ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు విలియమ్సన్. “ఇప్పుడు ముగ్గురు.. నువ్వు ఈ వరల్డ్ లోకి సేఫ్ గా ల్యాండ్ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గొప్ప భవిష్యత్ ముందుంది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు కేన్ మామ. కాగా.. అతడికి ఇది మూడో సంతానం.

2020లో అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత అబ్బాయి ఇక ఇప్పుడు అమ్మాయి జన్మించింది. 2015 నుంచి సారా రహీం, కేన్ విలియమ్సన్ భాగస్వాములుగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు, నెటిజన్లు కేన్ మామ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్ లాంటి క్రికెటర్లు విషెస్ తెలిపినవారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ.. దూసుకెళ్తున్నాడు. కేవలం 10 ఇన్నింగ్స్ ల్లో 6 శతకాలతో దుమ్మురేపాడు. భీకరఫామ్ లో ఉన్న కేన్ మామకు మరింత సంతోషం యాడైంది.

 

View this post on Instagram

 

A post shared by Kane Williamson (@kane_s_w)

ఇదికూడా చదవండి: ధృవ్ జురెల్ కు కారు గిఫ్ట్.. ఈసారి ఆనంద్ మహీంద్ర కాదు!

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio