iDreamPost

ధృవ్ జురెల్ కు కారు గిఫ్ట్.. ఈసారి ఆనంద్ మహీంద్ర కాదు!

రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో సూపర్బ్ నాక్ తో అదరగొట్టిన ధృవ్ జురెల్ కు కారును గిఫ్ట్ గా ప్రకటించింది ప్రముఖ కంపెనీ. అయితే ఈసారి ఈ గిఫ్ట్ ఇచ్చింది ఆనంద్ మహీంద్ర కాదు. ఎవరంటే?

రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో సూపర్బ్ నాక్ తో అదరగొట్టిన ధృవ్ జురెల్ కు కారును గిఫ్ట్ గా ప్రకటించింది ప్రముఖ కంపెనీ. అయితే ఈసారి ఈ గిఫ్ట్ ఇచ్చింది ఆనంద్ మహీంద్ర కాదు. ఎవరంటే?

ధృవ్ జురెల్ కు కారు గిఫ్ట్.. ఈసారి ఆనంద్ మహీంద్ర కాదు!

భారతదేశంలో క్రికెట్ కు ఉన్నంత ఆదరణ.. మరే ఇతర క్రీడలకు లేదు. ఇండియాలో మ్యాచ్ జరిగితే చాలు.. గ్రౌండ్ మెుత్తం ప్రేక్షకులతో కిటకిటలాడుతుంది. ఇక టీమిండియా సాధించే విజయాలకు ప్రేక్షకులకే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. తమ ఆనందాన్ని ఆటగాళ్లకు బహుమతులు ఇవ్వడం ద్వారా పంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి ఆనంద్ మహీంద్ర ‘థార్’ గిఫ్ట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో సూపర్బ్ నాక్ తో అదరగొట్టిన ధృవ్ జురెల్ కు సైతం కారును గిఫ్ట్ గా ప్రకటించింది ప్రముఖ కంపెనీ. అయితే ఈసారి ఈ గిఫ్ట్ ఇచ్చింది ఆనంద్ మహీంద్ర కాదు.

ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా యువ క్రికెటర్ ధృవ్ జురెల్. అసాధారణ బ్యాటింగ్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆడుతున్న రెండో మ్యాచ్ లోనే ఎంతో పరిణతి చెందిన ఆటగాడిలా బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే జురెల్ కు ఓ కారును గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రముఖ కంపెనీ ప్రకటించింది. అయితే ఇది విన్న అందరూ ఇంకెవరు.. ఆనంద్ మహీంద్రానే కదా? అంటూ అనుకుంటున్నారు. కానీ ఈసారి కారు గిఫ్ట్ గా ఇచ్చింది ఆనంద్ మహీంద్ర కాదు. మరో ప్రముఖ కార్ల కంపెనీ ‘మోరీస్ గ్యారెజెస్'(MG).

Car gift to Dhruv Jurel

జురెల్ అద్భుత ఇన్నింగ్స్ కు ఫిదా అయిన ఎంజీ కంపెనీ ఆఫ్ ఇండియా టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పడంతో పాటుగా అతడికి MG హెక్టార్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాని ధర మార్కెట్ లో అక్షరాలా రూ. 15 నుంచి 27 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆనంద్ మహీంద్రపై సెటైర్లు వేస్తున్నారు కొందరు నెటిజన్లు. మహీంద్ర జీ ఎక్కడున్నారు..మీరు కూడా థార్ ను గిఫ్ట్ గా ప్రకటించండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కీలకమైన 90, 39* పరుగులు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది అవార్డును గెలుచుకున్నాడు జురెల్. దీంతో 22 ఏళ్ల తర్వాత డెబ్యూ సిరీస్ లోనే అవార్డు గెలచుకున్న రెండో టీమిండియా వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. మరి ఎంజీ కంపెనీ జురెల్ కు కారు గిఫ్ట్ గా ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విహారి ఈ నిజాలు ఎలా మరిచావు? వివాదంలో అసలు వాస్తవం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి