Somesekhar
Kane Williamson: న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో ఓ రేర్ ఫీట్ జరిగింది. 12 ఏళ్ల తర్వాత కేన్ విలియమ్సన్ కు అలా జరగడం ఇదే తొలిసారికావడం గమనార్హం.
Kane Williamson: న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో ఓ రేర్ ఫీట్ జరిగింది. 12 ఏళ్ల తర్వాత కేన్ విలియమ్సన్ కు అలా జరగడం ఇదే తొలిసారికావడం గమనార్హం.
Somesekhar
ప్రపంచ క్రికెట్ లో ఎన్నో అరుదైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ఫ్యాన్స్ ను అటెన్షన్ కు గురిచేస్తాయి. తాజాగా అలా క్రికెట్ అభిమానులను అటెన్షన్ కు గురిచేసిన ఓ సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇది జరిగింది. పాపం కేన్ విలియమ్సన్ కు అలా జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే?
కేన్ విలియమ్సన్.. ప్రస్తుతం టెస్టుల్లో భీకరఫామ్ లో ఉన్నాడు. గడిచిన 10 మ్యాచ్ ల్లో 6 సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే పలువురి దిగ్గజాల రికార్డులను బద్దలుకొట్టాడు కేన్ మామ. ఇక అదే జోరును ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోనూ చూపించాలనుకున్నాడు. కానీ అతడికి అదృష్టం కలిసిరాలేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన కేన్ మామ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు. రనౌట్ రూపంలో అతడు పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు.
అయితే అతడు తన టెస్ట్ కెరీర్ లో ఇలా రనౌట్ కావడం కేవలం ఇది రెండోసారి మాత్రమే. తొలిసారి జింబాబ్వేతో నేపియర్ వేదికగా 2012లో జరిగిన మ్యాచ్ లో రనౌట్ కాగా.. మళ్లీ ఇప్పుడు ఏకంగా 12 సంవత్సరాల తర్వాత రనౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ చివరి బాల్ ను కేన్ మామ స్ట్రైట్ గా ఆడాడు.. అయితే రన్నింగ్ చేసే క్రమంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న విల్ యంగ్ ను ఢీ కొన్నాడు. అప్పటికే లబూషేన్ బాల్ ను వికెట్లకు త్రో చేశాడు. దీంతో నిరాశగా పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. తాజాగా కేన్ మామ మూడోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య సారా రహీం ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ 275 బంతుల్లో 23 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. ప్రస్తుతం 41 ఓవర్లలకు 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కరీజ్ లో మ్యాట్ హెన్రీ(27), కెప్టెన్ టీమ్ సౌథీ(1) బ్యాటింగ్ చేస్తున్నారు.
KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS…!!! 🤯pic.twitter.com/KRheTm61sg
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024
ఇదికూడా చదవండి: రోహిత్, కోహ్లీ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!