iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రపంప కప్ లో చెత్త రివ్యూ.. నవ్వాపుకోలేకపోయిన కేన్ మామ!

  • Author Soma Sekhar Published - 09:11 PM, Thu - 9 November 23

వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయిస్తోంది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఈ రివ్యూని చూసి.. ముఖం దాచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయిస్తోంది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఈ రివ్యూని చూసి.. ముఖం దాచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 09:11 PM, Thu - 9 November 23
వీడియో: ప్రపంప కప్ లో చెత్త రివ్యూ.. నవ్వాపుకోలేకపోయిన కేన్ మామ!

ప్రపంచ కప్ లో భాగంగా గురువారం శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్ సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ దాదాపు సెమీస్ చేరినట్లే. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ నవ్వులు పూయించే సన్నివేశం చోటుచేసుకుంది. లంక బ్యాటర్ ను అవుట్ చేయడం కోసం కివీస్ తీసుకున్న రివ్యూ నవ్వులు పూయిస్తోంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అయితే ఏకంగా ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని మరీ ముసిముసి నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. దీంతో ప్రపంచ కప్ లో అత్యంత చెత్త రివ్యూ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలను మరింత సులభతరం చేసుకుంది న్యూజిలాండ్. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో అత్యంత చెత్త రివ్యూ నమోదు అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 113 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయి ఆలౌట్ కు దగ్గరైంది. ఈ సమయంలో విలియమ్సన్ ఫెర్గ్యూసన్ కి మరోసారి బాల్ ఇచ్చాడు. 24వ ఓవర్ వేయడానికి వచ్చిన ఫెర్గ్యూసన్ మూడో బంతికి కరుణరత్నేను అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చాడు చమీరా. ఇక అతడికి నాలుగో బంతిని ఫుల్ టాస్ గా సంధించగా.. బాల్ ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని చమీరా ప్యాడ్ కు తాకింది.

దీంతో డైరెక్ట్ గా బాల్ ప్యాడ్ కు తాకిందని భావించిన కివీస్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. ఈ సమయంలో డార్లీ మిచెల్ ఎంతో కాన్ఫిడెన్స్ గా రివ్యూకు వెళ్లమని కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు సూచించాడు. అతడి మాటలు నమ్మిన కేన్ మామ గుడ్డిగా రివ్యూ తీసుకున్నాడు. అయితే రిప్లేలో క్లియర్ గా బాల్ బ్యాట్ కు తగలడం కనిపించడంతో.. కివీస్ ప్లేయర్లు ఒక్కసారిగా బిక్కముఖం వేసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ.. నవ్వుకున్నారు. ఇక ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోయిన కివీస్ సారథి కేన్ మామ తన ముఖానికి చేయి అడ్డుపెట్టుకుని ముసిముసి నవ్వులు చిందించాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇది ప్రపంచ కప్ లోనే అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి 171 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో కుశాల్ పెరీరా(51) ఒక్కడే రికార్డు అర్ధశతకంతో రాణించాడు. మిగతా వారిలో మహేష్ తీక్షణ(38*) రన్స్ తో ఆకట్టుకున్నాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికట్లతో సత్తాచాటాడు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కాన్వే(45), రచిన్ రవీంద్ర(42), డార్లీ మిచెల్(43) పరుగులతో రాణించారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet