iDreamPost
android-app
ios-app

IND vs SA: టీమిండియాతో సిరీస్‌.. సౌతాఫ్రికాకు మరో బిగ్‌ షాక్‌!

  • Published Dec 14, 2023 | 4:36 PM Updated Updated Dec 14, 2023 | 4:36 PM

సౌతాఫ్రికాతో ప్రస్తుతం టీ20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియాకు ఒక గుడ్‌న్యూస్‌ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అయితే.. ఇది ఇండియాకు గుడ్‌న్యూస్‌ అయినా.. సౌతాఫ్రికాకు మాత్రం బ్యాడ్‌ న్యూస్‌. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో ప్రస్తుతం టీ20 సిరీస్‌ ఆడుతున్న టీమిండియాకు ఒక గుడ్‌న్యూస్‌ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అయితే.. ఇది ఇండియాకు గుడ్‌న్యూస్‌ అయినా.. సౌతాఫ్రికాకు మాత్రం బ్యాడ్‌ న్యూస్‌. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 14, 2023 | 4:36 PMUpdated Dec 14, 2023 | 4:36 PM
IND vs SA: టీమిండియాతో సిరీస్‌.. సౌతాఫ్రికాకు మరో బిగ్‌ షాక్‌!

టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు ప్రొటీస్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. ఇప్పటికే టీ20ల్లో చివరి మ్యాచ్‌కు చేరుకుంది. గురువారం జరిగే మూడో టీ20తో పొట్టి సిరీస్‌ ముగియనుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఇక రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. మరి మూడో మ్యాచ్‌లో సూర్య సేన గెలిచి సిరీస్‌ను సమంలో చేస్తుందో.. లేక 2-0తో సౌతాఫ్రికాకు సిరీస్‌ అప్పగిస్తుందో చూడాలి. ఆ తర్వాత.. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో యంగ్‌ టీమిండియా సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది.

ఆ వెంటనే పూర్తిస్థాయి జట్టుతో రెండు టెస్టు మ్యాచ్‌లు ప్రొటీస్‌ పర్యటనను ముగించనుంది భారత జట్టు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత.. ఇప్పటి వరకు సీనియర్ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా, షమీ, రాహుల్‌ మళ్లీ మైదానంలోకి దిగలేదు. రాహుల్‌ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనుండగా.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, షమీ టెస్ట్‌ సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగనున్నారు. వీరి కోసం భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌ కప్‌ ఓటమి మర్చిపోయి.. కోహ్లీ, రోహిత్‌ మైదానంలో ఉత్సాహంగా కదులుతుంటే చూడాలని ఫ్యాక్స్‌ అంతా ఆశపడుతున్నారు.

రోహిత్‌, కోహ్లీ, బుమ్రా, షమీ రాకతో టీమిండియా ఎంత బలంగా ఉంటుందో.. ప్రత్యర్థి సౌతాఫ్రికా సైతం సమవుజ్జీగా ఉండనుంది. కానీ, టెస్ట్‌ సిరీస్‌ ఆరంభానికి ముందే సౌతాఫ్రికాకు షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ టెస్ట్‌కు సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్త కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే.. సౌతాఫ్రికా బౌలింగ్‌ ఎటాక్‌ భారీగా బలహీన పడినట్లే. ఎందుకంటే.. టెస్టుల్లో రబాడ ఎంత డేంజరస్‌ బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా సొంత పిచ్‌లపై రబాడను ఎదుర్కొవడం అంత సులువైన విషయం కాదు. కానీ, ఇప్పుడు రబాడ టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చనే విషయం టీమిండియాకు గుడ్‌న్యూస్‌గా మారనుంది. అయితే.. రబాడ గైర్హాజరీకి కారణం మాత్రం ఇంకా తెలియాల్సి వచ్చింది. మరి రబాడ టెస్ట్‌ సిరీస్‌కు దూరం అయితే.. టీమిండియాకు లాభమా? కాదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.