Nidhan
Josh Hazlewood Warns Team India: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ టీమిండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఈసారి కథ వేరేలా ఉంటుందన్నాడు.
Josh Hazlewood Warns Team India: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ టీమిండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఈసారి కథ వేరేలా ఉంటుందన్నాడు.
Nidhan
ఆస్ట్రేలియా.. ఈ పేరు చెబితేనే అన్ని క్రికెటింగ్ నేషన్స్ భయపడతాయి. గత పాతికేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఆ టీమ్ నడిపిస్తున్న హవా అలాంటిది. మేజర్ ఐసీసీ ట్రోఫీలను ఎగరేసుకుపోవడం కంగారూలకు అలవాటుగా మారింది. ఇంక ఆ దేశంలో పర్యటించే జట్లు ఖాళీ చేతులతో తిరిగి రావడం ఆనవాయితీగా మారింది. పరాయి గడ్డపై ఇరగదీసే ఆసీస్.. సొంతగడ్డపై బెబ్బులిలా విజృంభించి ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తుంది. అయితే అందర్నీ భయపెట్టే కంగారూలు.. ఇప్పుడు భారత్‌కు భయపడుతున్నారు. మన టీమ్ పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆస్ట్రేలియా సీనియర్లతో పాటు ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు కూడా మన మీద కారాలు మీరాలు నూరుతున్నారు. ఆ టీమ్ స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ టీమిండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు. ఈసారి కథ వేరేలా ఉంటుందన్నాడు.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్ సేనను విడిచిపెట్టబోమని హెచ్చరిస్తున్నాడు హేజల్‌వుడ్. ఆ ట్రోఫీని ఎగరేసుకుపోతామని అంటున్నాడు. ఈ పేసర్ మాట్లాడుతోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి. ఈ ఏడాది ఆఖర్లో ఈ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌కు పయనం కానున్నారు భారత ఆటగాళ్లు. గత రెండు పర్యటనల్లో కంగారూలను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఆసీస్‌ను వాళ్ల సొంతగడ్డపై మరోమారు చిత్తు చేసి తమ డామినేషన్‌ను గట్టిగా చాటి చెప్పాలని భారత్ భావిస్తోంది. అయితే సిరీస్‌కు ఇంకా చాలా టైమ్ ఉన్నా కంగారూలు మాత్రం ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటి నుంచే మాటల తూటాలు పేల్చుతున్నారు. అందులో భాగంగానే హేజల్‌వుడ్ మెన్ ఇన్ బ్లూకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తమదేనని బల్ల గుద్ది చెప్పాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..
‘టీమిండియాతో తలపడటం ఎప్పుడూ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. మా అత్యంత బలమైన శత్రువు ఆ జట్టే. ఆస్ట్రేలియా కండీషన్స్ గురించి భారత ఆటగాళ్లకు బాగా తెలుసు. ఇక్కడ అదరగొట్టాలని వాళ్లు ఉవ్విళ్లూరుతుంటారు. వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. టాప్-7 ప్లేయర్లు చాలా సాలిడ్‌గా ఉన్నారు. మా టీమ్ కూడా దుర్భేద్యంగా ఉంది. గెలుపు కోసం మేం చాలా ఆకలిగా ఉన్నాం. ఈసారి కాంపిటీషన్ హైలెవల్లో ఉండబోతోంది. మేం తప్పకుండా నెగ్గుతాం’ అని హేజల్‌వుడ్ స్పష్టం చేశాడు. ఈ మధ్య కాలంలో భారత్ మీద సిరీస్ గెలవని మాట వాస్తవమేనని.. కానీ ఈసారి లెక్క మారుస్తామన్నాడు ఆసీస్ పేసర్. ఇక, 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు హేజల్‌వుడ్. అప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియాతో ఆడిన ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా ఆసీస్ గెలుచుకోలేదు. అందుకే తాము ఆకలితో ఉన్నామని అన్నాడతను. మరి.. టీమిండియాను ఈసారి ఓడిస్తామంటూ హేజల్‌వుడ్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.