iDreamPost
android-app
ios-app

Josh Brown: ఆస్ట్రేలియాలో జూనియర్ మ్యాక్స్‌వెల్‌! 57 బంతుల్లో 140 పరుగులు

  • Published Jan 22, 2024 | 4:22 PM Updated Updated Jan 22, 2024 | 4:23 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక బిగ్‌ బాష్‌ లీగ్‌ 2024లో బ్రిస్పెన్‌ హీట్‌ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 సిక్సులతో గ్రౌండ్‌లో సిక్సుల సునామీ తెచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక బిగ్‌ బాష్‌ లీగ్‌ 2024లో బ్రిస్పెన్‌ హీట్‌ ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 సిక్సులతో గ్రౌండ్‌లో సిక్సుల సునామీ తెచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 22, 2024 | 4:22 PMUpdated Jan 22, 2024 | 4:23 PM
Josh Brown: ఆస్ట్రేలియాలో జూనియర్ మ్యాక్స్‌వెల్‌! 57 బంతుల్లో 140 పరుగులు

టీమిండియా క్రికెట్‌ అంటేనే బ్యాటర్ల రాజ్యం. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బౌలర్లు పైచేయి సాధిస్తూ ఉంటారు. కానీ, ఎక్కువ సార్లు బ్యాటర్ల హవా కొనసాగుతుంది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో ఒక సంచలన ఇన్నింగ్స్‌ చోటు చేసుకుంది. అది మామూలు బాదుడు కాదు.. బాల్‌ పడితే.. ఫోరో, సిక్సో వెళ్లడం ఖాయం అన్నట్లు సాగింది.. ఆ విధ్వంసం. ఈ సునామీ సృష్టించింది.. ఆసీస్‌ ఆటగాడు జోష్‌ బ్రౌన్‌. క్వీన్స్‌ల్యాండ్‌ వేదికగా.. సోమవారం బ్రిస్బెన్‌ హీట్‌- అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రౌన్‌ సంచలనం సష్టించాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సులతో 140 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రౌన్‌.. ఆది నుంచి అడిలైడ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏ బౌలర్‌ ఎదురుగా ఉన్నా తన బాదడం మాత్రం ఆపలేదు. బ్రౌన్‌ విధ్వంసం చూస్తే.. చాలా సులువుగా డబుల్‌ సెంచరీ బాదేస్తాడేమో అని అనిపించింది. మొత్తంగా 57 బంతుల్లో 245.61 స్ట్రైక్‌రేట్‌తో సరిగ్గా 140 పరుగులు చేసి.. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో డేవిడ్‌ పైన్‌ బౌలింగ్‌లో హ్యరీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. దీంతో.. సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, బ్రిస్బెన్‌ ఇన్నింగ్స్‌లో బ్రౌన్‌ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.

distraction in 57 balls

బ్రౌన్‌తో పాటు ఓపెనర్‌గా వచ్చిన వకీమ్‌ 6 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన నాథన్‌ 29 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ, ఆ తర్వాత మరే బ్యాటర్‌ కూడా కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పో​యి బ్రిస్బెన్‌ 214 పరుగులు చేసింది. ఇంకా అడిలైడ్‌ ఇన్నింగ్స్‌ జరగాల్సి ఉంది. అడిలైడ్‌ బౌలర్లలో డేవిడ్‌ పైన్‌, కామెరోన్‌, పోప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో జోష్‌ బ్రౌన్‌ సంచలన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలి​యజేయండి.