వీడియో: ENG vs SA మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌లు! అలాగే ఒక దొంగ క్యాచ్‌ కూడా..

Jos Buttler, Mark Wood, ENG vs SA, T20 World Cup 2024: ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్‌, ఒక అబద్ధపు క్యాచ్‌ రెండూ చోటు చేసుకున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Jos Buttler, Mark Wood, ENG vs SA, T20 World Cup 2024: ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్‌, ఒక అబద్ధపు క్యాచ్‌ రెండూ చోటు చేసుకున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా సూపర్‌ 8లో శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. సెయింట్‌ లూసియాలోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ విజయంతో సౌతాఫ్రికా తమ సెమీ ఫైనల్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చకుంది. సూపర్‌ 8 గ్రూప్‌ 2లో సౌతాఫ్రికా రెండు విజయాలు, నాలుగు పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉంది. అయితే.. ఇంగ్లండ్‌-సౌతాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు చోటు చేసుకుంది. ఇరు జట్ల నుంచి ఆటగాళ్లు సూపర్‌ క్యాచ్‌లు అందుకున్నారు. వాటిలో జోష్‌ బట్లర్‌ అందుకున్న క్యాచ్‌ గురించి మాట్లాడుకోవాలి.

మ్యాచ్‌ ఓడినా కూడా ఇంగ్లండ్‌ కెప్టెన​ బట్లర్‌ అందుకున్న క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ ఐదో బంతికి క్వింటన్‌ డికాక్‌ అప్పర్‌ కట్‌ షాట్‌ ఆడదాం అనుకున్నాడు. కానీ, అది కాస్త మిస్‌ అయి.. బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌కు ఎడమ వైపు నుంచి దూరంగా దూసుకెళ్తోంది. ఆ బంతి అమాంతం గాల్లోకి దూకి బట్లర్‌ అద్భుతంగా అందుకున్నాడు. అప్పటికే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన బట్లర్‌ 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. అయితే.. అవుట్‌ అవ్వడం కంటే కొంచెం ముందు మాత్రం డికాక్‌ ఒక ఫేక్‌ క్యాచ్‌కు బలి అయ్యేవాడు. కానీ, అదృష్టం కొద్ది బతికిపోయాడు.

ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ రెండో బంతిని డికాక్‌ స్వీప్‌షాట్‌ ఆడాడు. అది కాస్త వెళ్లి మార్క్‌ వుడ్‌ చేతుల్లో పడింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. కానీ, డికాక్‌ మాత్రం గ్రౌండ్‌ వీడటం లేదు. క్యాచ్‌ క్లీన్‌ కాదని తనకు డౌట్‌ ఉందని అంపైర్లుకు చెప్పాడు. మార్క్‌ వుడ్‌ మాత్రం తాను క్యాచ్‌ను క్లీన్‌గా పట్టానని అంటున్నాడు. దీంతో అంపైర్లు థర్డ్‌ అంపైర్‌కు క్యాచ్‌ను రిఫర్‌ చేశారు. రీప్లేలో చూస్తే బాల్‌ నేలను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. మార్క్‌ వుడ్‌ దొంగ క్యాచ్‌ వల్ల అవుట్‌ అయ్యే ప్రమాదం నుంచి డికాక్‌ తప్పించుకున్నాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఒక ఫేక్‌ క్యాచ్‌, ఒక సూపర్‌ క్యాచ్‌కు చూసే అవకాశం కలిగింది. అయితే.. ఈ రెండు క్యాచ్‌లు కూడా డికాక్‌వే కావడం విశేషం. మరి బట్లర్‌ అద్భుతమైన క్యాచ్‌తో పాటు మార్క్‌ వుడ్‌ అబద్ధపు క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments