iDreamPost
android-app
ios-app

నాకు రాత్రులు నిద్రలేకుండా చేసిన బౌలర్‌ అతనే: జానీ బెయిర్‌స్టో

  • Published Apr 20, 2024 | 10:33 AM Updated Updated Apr 20, 2024 | 10:33 AM

Jonny Bairstow, Mitchell Johnson: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతూ.. అంతగా ఫామ్‌లో లేని జానీ బెయిర్‌ స్టో.. తాజాగా పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Jonny Bairstow, Mitchell Johnson: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడుతూ.. అంతగా ఫామ్‌లో లేని జానీ బెయిర్‌ స్టో.. తాజాగా పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 20, 2024 | 10:33 AMUpdated Apr 20, 2024 | 10:33 AM
నాకు రాత్రులు నిద్రలేకుండా చేసిన బౌలర్‌ అతనే: జానీ బెయిర్‌స్టో

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌ స్టో గురించి క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఐపీఎల్‌ పంజాబ్‌ కింగ్స​ తరఫున ఆడుతున్నాడు. అయితే.. ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేని బెయిర్‌ స్టో కొన్ని మ్యాచ్‌లు ఆడి.. బెంచ్‌కి పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న బెయిర్‌ స్టో.. తనకు తాను ఎదుర్కొన్న బౌలర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో చాలా మంది బౌలర్లను ఇబ్బంది పెట్టిన బెయిర్‌ స్టో.. తన కెరీర్‌లో తనను ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఎవరో కూడా తాజాగా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశాడు. పైగా తనకు నిద్రలేకుండా చేసిన బౌలర్‌ కూడా ఒకడు ఉన్నాడని బెయిర్‌ స్టో తెలిపాడు. అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..

బెయిర్‌ స్టో అంటే అగ్రెసివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌కు మారుపేరు అలాంటి ఆటగాడిని కూడా చాలా మంది బౌలర్లు ఇబ్బంది పెట్టారంట. అయితే.. తాను ఎదుర్కొన్న బౌలర్లలో ది బెస్ట్‌ బౌలర్లు అంటే సౌతాఫ్రికా దిగ్గజ మాజీ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ , అలాగే టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ ఇద్దరు తాను ఎదుర్కొన్న బెస్ట్‌ బౌలర్లు అని అన్నాడు. అలాగే నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొవాలని తాను కోరుకోనని కూడా బెయిర్‌ స్టో తెలిపాడు. ఆర్చర్‌.. ఇంగ్లండ్‌ స్టార్‌ స్పీడ్‌ బౌలర్‌ అనే విషయం తెలిసిందే.

డేల్‌ స్టెయిన్‌, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి బౌలర్లు బెస్ట్‌ బౌలర్లు అని పేర్కొన్నా.. తనకు రాత్రులు నిద్రలేకుండా చేసిన బౌలర్‌ ఒకడు ఉన్నాడని, అతనే ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సెన్‌ అని బెయిర్‌ స్టో తెలిపాడు. జాన్సెన్‌ ఎంత గొప్ప బౌలరో అందరికి తెలిసిందే. అతని యాటిట్యూడ్‌ ఎలా ఉన్నా.. బౌలర్‌గా ఎంతో టాలెంటెడ్‌. ప్రపంచంలోని హేమాహేమీ బ్యాటర్లను కూడా భయపెట్టాడు జాన్సెన్‌. ఇక ఇంగ్లండ్‌ టీమ్‌లో ఒక ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఉండాలంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటావ్‌ అని బెయిర్‌ స్టోని ప్రశ్నించగా.. ప్యాట్‌ కమిన్స్ పేరు చెప్పాడు బెయిర్‌స్టో. అతను బ్యాటింగ్‌, బౌలింగ్‌తో జట్టు ఎంతో ఉపయోగపడతాడని చెప్పాడు. అలాగే బ్యాకప్‌ స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా ఉంటే బెస్ట్‌ అని బెయిర్‌ స్టో వెల్లడించాడు. మరి బెయిర్‌స్టో చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.