iDreamPost
android-app
ios-app

వీడియో: ఔట్‌ అని వెళ్లిపోయిన స్మిత్‌.. కొంపముంచిన బెయిర్‌ స్టో!

  • Published Jul 29, 2023 | 10:33 AM Updated Updated Jul 29, 2023 | 10:33 AM
  • Published Jul 29, 2023 | 10:33 AMUpdated Jul 29, 2023 | 10:33 AM
వీడియో: ఔట్‌ అని వెళ్లిపోయిన స్మిత్‌.. కొంపముంచిన బెయిర్‌ స్టో!

ప్రపంచ క్రికెట్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత అంతటి క్రేజ్‌ ఉన్న సిరీస్‌ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా యాషెస​ సిరీస్‌. ఈ సిరీస్‌ గెలిచేందుకు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్లు ప్రాణం పెట్టి ఆడుతాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల ఈ సుదీర్ఘ సిరీస్‌ ఎప్పుడూ స్పెషల్‌. అద్భుత ప్రదర్శనలు, వివదాలు, గొడవలతో యాషెస్‌ ఓ మినీ యుద్ధంలా సాగుతుంది. తాజాగా జరుగుతున్న సిరీస్‌ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఐదో టెస్టులో ఓ వివాదం రాజుకుంది. ఈ వివాదం అంపైర్‌ నిర్ణయం కారణంగా చెలరేగింది. ఈ మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ సూపర్‌ అంపైరింగ్‌తో ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ రనౌట్‌ కాకుండా బతికిపోయాడు. అయితే స్మిత్‌ రనౌట్‌ అయినా థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయంతోనే తప్పించుకున్నాడంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ వేసిన 78వ ఓవర్‌ మూడో బంతిని స్మిత్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడి వేగంగా తొలి పరుగులు పూర్తి చేసుకుని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ లోగా ఇంగ్లండ్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ జార్జ్‌ ఎల్‌హామ్‌ మెరుపువేగంతో బంతిని అందుకుని వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌ స్టోకి బంతిని విసిరాడు. దాన్ని అందుకున్న బెయిర్‌ స్టో వికెట్లను పడగొట్టాడు. రనౌట్‌ అప్పీల్‌ని ఫీల్డ్‌ అంపైర్లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేయగా.. రీప్లేలో స్మిత్‌ అవుటైనట్లు కనిపించింది. దీంతో స్మిత్‌ సైతం తాను అవుట్‌ అనుకుని నిరాశగా క్రీజ్‌ వదిలి పెవిలియన్‌ వైపు కదిలాడు. కానీ, థర్డ్‌ అంపైర్‌ చాలా సేపు నిశితంగా పరిశీలించి.. బెయిర్‌ స్టో బాల్‌ అందుకునేకంటే ముందే తన గ్లౌజ్‌ వికెట్లకు తగలింది, దాంతో ఒక బెయిల్‌ పైకి లేచింది. రెండో బెయిల్‌ పడే పడేసరికి స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చేశాడు.

తొలి బెయిల్‌ పడేసరికి క్రీజ్‌కు రెండు ఇంచుల బయటే ఉన్నాడు స్మిత్‌. కానీ, అది బెయిర్‌ స్టో గ్లౌజ్‌ తగిలి లేచింది. అప్పుడు బాల్‌ ఇంకా బెయిర్‌స్టో చేతుల్లోకి రాలేదు. బెయిర్‌ స్టో కావాలని గ్లౌజ్‌తో వికెట్లను తాకకపోయినా.. అది పొరపాటున తగిలింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ రెండో బెయిల్‌ను పరిశీలించి అది పడే సమయానికి స్మిత్‌ క్రీజ్‌లోకి వచ్చేసినట్లు నిర్దారించి స్మిత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ రనౌట్‌ సమయానికి 41 పరుగులతో ఉన్న స్మిత్‌.. బెయిర్‌ స్టో ఇచ్చిన లైఫ్‌తో 123 బంతుల్లో 6 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. అయితే.. స్మిత్‌ అవుట్‌ అయ్యాడని అంపైర్‌ నిర్ణయం తప్పని ఇంగ్లండ్‌ క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి కింద ఉన్న రీప్లే వీడియో చూసి.. ఆ రనౌట్‌పై అంపైర్‌ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాబిన్‌ ఊతప్ప విశ్వరూపం! ఫోర్లు, సిక్సుర్ల వర్షం కురిపించేశాడుగా..