SNP
Jonny Bairstow 100th Test:
Jonny Bairstow 100th Test:
SNP
భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదోవ టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఇప్పటికే ముగిసిన నాలుగు టెస్టుల్లో టీమిండియా వరుసగా మూడు టెస్టులు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ.. తిరిగి పుంజకుని.. తర్వాత మూడు మ్యాచ్‌ల్లో విజయ ఢంకా మోగించింది. ప్రస్తుతం జరుగుతున్న చివరి టెస్టు నామమాత్రమే అయినా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ కావడంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకుని బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్స్‌తో బరిలోకి దిగాయి. అయితే.. ఈ మ్యాచ్ ప్రారంభ సమయంలో ఓ స్టార్ క్రికెటర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు ఇదే చివరి టెస్ట్ కావచ్చు కానీ.. ఓ ఇద్దరు ఆటగాళ్ల కెరీర్‌లో ఇది వందో టెస్టు. అతి కొద్ది మంది క్రికెటర్లు మాత్రమే అందుకునే ఈ అరుదైన ఫీట్‌ను ఈ టెస్ట్‌తో ఓ ఇద్దరు ఆటగాళ్లు సాధించారు. పైగా వాళ్లిద్దరు ఓకే టీమ్‌కు చెందిన క్రికెటర్లు కూడా కాదు. యాధృశ్చికంగా టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్‌స్టో ఈ ఐదో టెస్టుతో తమ కెరీర్‌లో వందో టెస్టు అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఒకే మ్యాచ్‌తో తమ కెరీర్‌లో వందో టెస్ట్ క్యాప్ అందుకోవడం విశేషం.
ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్‌కు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వందో టెస్ట్‌కు ప్రత్యేకమైన క్యాప్‌ను బహూకరించాడు. తన కుటుంబంతో అశ్విన్ ఈ సంతోషాన్ని పంచుకున్నాడు. భార్య, కూతురితో కలిసి స్పెషల్ క్యాప్‌ను అందుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో వందో టెస్టు సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ఉద్విగ్నక్షణంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తల్లికి వందో టెస్టును అంకితం ఇస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన బెయిర్ స్టో.. మ్యాచ్ ప్రారంభానికి ముందుకు ఎమోషనల్ అయ్యాడు. తన చిన్నతనంలో తండ్రి ఆత్మహత్య చేసుకున్నా.. తల్లి ధైర్యం కోల్పోకుండా తమను ఎంతో కష్టపడి పెంచి, ఇంత వాడిని చేసిందని.. అందుకే ఈ వందో టెస్టును ఆమెకు అంకితం ఇస్తున్నట్లు బెయిర్ స్టో తెలిపాడు. మరి ఈ బెయిర్ స్టో ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jonny Bairstow got emotional and tears in his eyes on his 100th Test match occasion with his mother.
– A Memorable moments for him & his family…!!!! pic.twitter.com/S2YOhbsAGG
— CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024