iDreamPost
android-app
ios-app

KKRపై మ్యాచ్‌ గెలిచాక కన్నీళ్లు పెట్టుకున్న బెయిర్‌ స్టో! ఎందుకంటే..?

  • Published Apr 27, 2024 | 11:04 AM Updated Updated Apr 27, 2024 | 11:04 AM

Jonny Bairstow, PBKS vs KKR, IPL 2024: ఐపీఎల్‌ 2024లో పంజాబ్‌ కింగ్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ చరిత్రలో భాగమైన జానీ బెయిర్‌ స్టో మ్యాచ్‌ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని కన్నీళ్లకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jonny Bairstow, PBKS vs KKR, IPL 2024: ఐపీఎల్‌ 2024లో పంజాబ్‌ కింగ్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ చరిత్రలో భాగమైన జానీ బెయిర్‌ స్టో మ్యాచ్‌ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని కన్నీళ్లకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 27, 2024 | 11:04 AMUpdated Apr 27, 2024 | 11:04 AM
KKRపై మ్యాచ్‌ గెలిచాక కన్నీళ్లు పెట్టుకున్న బెయిర్‌ స్టో! ఎందుకంటే..?

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌ స్టో విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 108 పరుగులు చేసి.. పంజాబ్‌కు ఈ సీజన్‌లో మూడో విజయాన్ని అందించాడు. కేకేఆర్‌పై పంజాబ్‌ సాధించింది మామూలు విజయం కాదు.. ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేసిన మ్యాచ్‌. టీ20 క్రికెట్‌లో అతి పెద్ద టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన టీమ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ నిలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సులతో 108 పరుగులు చేసి పంజాబ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, మ్యాచ్‌ తర్వాత బెయిర్‌ స్టో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి బెయిర్‌ స్టో ఎందుకు ఏడ్చాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

కేకేఆర్‌తో మ్యాచ్‌ కంటే ముందు బెయిర్‌ స్టో అంత మంచి ఫామ్‌లో లేడు. స్టార్టింగ్‌ మ్యాచ్‌లలో బెయిర్‌ స్టోకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో కూడా చోటు దక్కని పరిస్థితి ఉండేది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన బెయిర్‌ స్టో 204 పరుగుల చేశాడు. అందులో కేకేఆర్‌తో ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే 108 రన్స్‌ చేశాడు. అంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో బెయిర్‌ స్టో చేసిన రన్స్‌ కేవలం 96 మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బెయిర్‌ స్టో.. ఒక్క సారిగా తన పాత ఫామ్‌ను అందుకున్నాడు. అది కూడా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు. పైగా 262 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్‌ చేసే క్రమంలో.. సెంచరీతో చెలరేగడం, మ్యాచ్‌ చివరి వరకు నాటౌట్‌గా నిలవడంతో బెయిర్‌ స్టో ఎమోషనల్‌ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నీ రోజుల ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన అతను.. ఫామ్‌లోకి రావడంతో అలా రియాక్ట్‌ అయ్యాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌ 75, సునీల్‌ నరైన్‌ 71 పరుగులు చేసి.. పంజాబ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. వీరితోపాటు వెంకటేశ్‌ అయ్యర్‌ 39, రస్సెల్‌ 24, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 28 రన్స్‌ చేసి రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 2, సామ్ కరన్‌, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇక 262 పరుగులు భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌.. 18.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్‌ 54, జానీ బెయిర్‌ స్టో 108, రోసోవ్‌ 26, శశాంక్‌ సింగ్‌ 68 రన్స్‌తో పంజాబ్‌కు రికార్డ్‌ విక్టరీని అందించారు. కేకేఆర్‌ బౌలర్లో సునీల్‌ నరైన్‌ ఒక్కడికే ఒక వికెట్‌ దక్కింది. మరి ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టో బ్యాటింగ్‌తో పాటు, అతను కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.