ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో వివాదాలు, చీటింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. గ్రీన్, స్మిత్ ల వివాదాస్పద క్యాచ్ లు మరవక ముందే.. మరో వివాదానికి తెరలేపారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. రెండో టెస్ట్ మ్యాచ్ లో.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోని అవుట్ చేసిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. దాంతో 2011లో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరిగిన ఇదే తరహా సంఘటనను గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. ఇండియాను చూసైనా ఆస్ట్రేలియా బుద్ది తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా దుసుకెళ్తోంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఆసీస్.. రెండో మ్యాచ్ లో కూడా గెలిచి ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే.. యాషెస్ రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌట్ వివాదంపై చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించి బెయిర్ స్టోను రనౌట్ చేశారని, వారు గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు క్రీడాభిమానులు. ఆసీస్ బౌలర్ గ్రీన్ వేసిన ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.
ఈ ఓవర్ లో ఓ బంతిని షార్ట్ పిచ్ వేయగా.. బెయిర్ స్టో వదిలేశాడు. దాంతో బాల్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఓవర్ పూర్తి అయ్యిందనుకున్న బెయిర్ స్టో క్రీజ్ నుంచి ముందుకు వచ్చాడు. అప్పుడే ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ బాల్ ను వికెట్లకు విసిరాడు. ఆ బాల్ వికెట్లను గిరాటేయడంతో.. ఆసీస్ ఫీల్డర్లు అవుట్ అంటూ అప్పీల్ చేశారు. దాంతో థర్డ్ అంపైర్ రిప్లేలో చూసి.. బెయిర్ స్టో ను అవుట్ గా ప్రకటించాడు. దాంతో బెయిర్ స్టో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు. అయితే నిజానికి అది అవుట్ కాదు. బాల్ కీపర్ చేతుల్లోకి వెళ్లాక.. అతడు తన కాలుతో గీత గీసే బయటకి వచ్చాడు. కానీ అనూహ్యంగా థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆసీస్ ఆటగాళ్ల బుద్ది ఇంకా మారలేదని, టీమిండియాను, ధోనిని చూసి బుద్ది తెచ్చుకోవాలంటూ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
2011లో ఇంగ్లాండ్-భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి మంచి జోరుమీదున్నాడు ఇయాన్ బెల్. కాగా.. ఇషాంత్ వేసిన 66వ ఓవర్లో చివరి బంతిని ఇయాన్ మోర్గాన్ బౌండరీ వైపు కొట్టాడు. ఇదే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రవీణ్ కుమార్ బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపి.. త్రో వేశాడు. అయితే బంతి బౌండరీ వెళ్లిందనుకున్న బెల్ క్రీజులోకి వెళ్లకుండా నిలుచుండి పోయాడు. దాంతో బాల్ ను అందుకున్న టీమిండియా ఆటగాడు వికెట్లకు గిరాటేసి.. రనౌట్ గా అప్పీల్ చేశాడు. కాగా.. థర్డ్ అంపైర్లు రిప్లే చూడగా.. బంతి బౌండరీ దాటలేదని తేలింది. దాంతో అంపైర్లు బెల్ ను అవుట్ గా ప్రకటించారు. దీంతో నిరాశగా పెవిలియన్ వైపు చేరాడు ఇయాన్ బెల్.
ఇక ఈ బంతి తర్వాతనే టీ బ్రేక్ ఇస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా టీ బ్రేక్ తర్వాత బెల్ బ్యాటింగ్ వచ్చి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అసలు విషయం ఏంటంటే? టీ బ్రేక్ సమయంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు అంపైర్లు తెలిపారు. దాంతో తన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన ధోనిపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ప్రస్తుతం ఈ రెండు వీడియోలను షేర్ చేస్తూ.. ఇప్పటికైనా ఆస్ట్రేలియా బుద్ది తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి బెయిర్ స్టో రనౌట్ విషయాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Sanju Here 🤞👻 (@me_sanjureddy) July 2, 2023
BAIRSTOW IS RUN-OUT.
WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3
— Johns. (@CricCrazyJohns) July 2, 2023