iDreamPost
android-app
ios-app

వీడియో: ఐపీఎల్‌ చరిత్రలోనే గ్రేటెస్ట్‌ బాల్‌! బెయిర్‌స్టోకు దిమ్మతిరిగిపోయింది!

  • Published Apr 05, 2024 | 12:37 PMUpdated Apr 05, 2024 | 12:37 PM

Jonny Bairstow, Noor Ahmed, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స​ మ్యాచ్‌లో ఓ స్టన్నింగ్‌ డెలవరీ చోటు చేసుకుంది. ఆ బాల్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టోకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. మరి ఆ బాల్‌ను వేసిందో ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jonny Bairstow, Noor Ahmed, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స​ మ్యాచ్‌లో ఓ స్టన్నింగ్‌ డెలవరీ చోటు చేసుకుంది. ఆ బాల్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టోకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. మరి ఆ బాల్‌ను వేసిందో ఎవరో ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 05, 2024 | 12:37 PMUpdated Apr 05, 2024 | 12:37 PM
వీడియో: ఐపీఎల్‌ చరిత్రలోనే గ్రేటెస్ట్‌ బాల్‌! బెయిర్‌స్టోకు దిమ్మతిరిగిపోయింది!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ జోర్‌దార్‌గా సాగుతోంది. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా క్రికెట్‌ అభిమానులకు మంచి మజాను ఇస్తూ.. చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించినప్పటికీ గుజరాత్‌ టైటాన్స్‌ యువ బౌలర్‌ ఓ సంచలన బాల్‌ను వేశాడు. ఆ బాల్‌కు కొమ్ములు తిరిగిన బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో సైతం బిత్తరపోయాడు. ప్రస్తుతం ఆ బాల్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చాలా మంది క్రికెట్‌ అభిమానులు దాన్ని బాల్‌ ఆఫ్‌ ది ఐపీఎల్‌గా అభివర్ణిస్తున్నారు. ఇంతకీ ఆ బాల్‌ వేసింది ఎవరు? ఎందుకు అంత డేంజరస్‌ బాల్‌ అయింది? లాంటి విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

200 పరుగుల భారీ టార్గెట్‌తో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగింది. వారికి ఆరంభంలోనే ఉమేష్‌ యాదవ్‌ షాకిచ్చాడు. ఆ జట్టు కెప్టెన్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను రెండో ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. దీంతో పంజాబ్‌ 13 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో, ప్రభుసిమ్రాన్‌ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్న క్రమంలో.. పవర్‌ ప్లే చివరి ఓవర్‌ వేసేందుకు గుజరాత్‌ టైటాన్స్‌ యువ బౌలర్‌ నూర్‌ అహ్మద్‌ వచ్చాడు. ఆ ఓవర్‌ తొలి బంతికే పంజాబ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. 13 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి.. అద్భుతంగా ఆడుతున్న సమయంలో ఓ సూపర్ బాల్‌తో బెయిర్‌ స్టోను క్లీన్ బౌల్డ్‌ చేశాడు. ఎక్కడో లెగ్‌ సైడ్‌ పడుతున్న బాల్‌.. ఒక్కసారిగా భారీ టర్న్‌ తీసుకుని.. ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది.

ఆ బాల్‌కు అవుట్‌ అయ్యాకా.. ఏం అర్థం కానీ బెయిర్‌ స్టో అలాగే వికెట్లను చూస్తూ ఉండిపోవడం విశేషం. నూర్‌ అహ్మద్‌ ఆఫ్గనిస్తాన్‌కు చెందిన క్రికెటర్‌ అనేది తెలిసిన విషయమే. అంతర్జాతీయ క్రికెట్‌లో పసికూన టీమ్‌గా ఉన్న ఆఫ్గనిస్థాన్‌ నుంచి ఏకంగా 8 మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. అయితే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన నూర్‌ 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కానీ, ఈ మ్యాచ్‌లో చివరికి పంజాబ్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ 48 బంతుల్లో 89 పరుగులు చేసి అదరగొట్టాడు. కానీ, పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో శశాంక్‌ సింగ్‌ 61 పోరాటంతో పంజాబ్‌ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో కళ్లచెదిరే బాల్‌ వేసి బెయిర్‌స్టోను అవుట్‌ చేసిన నూర్‌ అహ్మద్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి