డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు పసికూన ఆఫ్ఘాన్ చేతిలో దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. బజ్ బాల్ క్రికెట్ అంటూ విర్రవీగిన ఇంగ్లీష్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లోనే జగజ్జేతకు కివీస్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆఫ్ఘాన్ సైతం కంగుతినిపించడంతో.. ఇంగ్లాండ్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారు అయ్యింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు ఓటములను చవిచూసింది ఛాంపియన్ టీమ్. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఓడించింది ఆ జట్టు సొంత ప్లేయరే. మరి సొంత జట్టును ఓడించిన ఆ ఇంగ్లాండ్ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్డే వరల్డ్ కప్ లో 14 వరుస ఓటముల తర్వాత గెలుపు బాటపట్టింది ఆఫ్ఘానిస్థాన్. 2015లో తొలిసారి వరల్డ్ కప్ ఆడిన ఈ పసికూన.. స్కాట్లాండ్ పై విజయం సాధించింది. కానీ ఆ తర్వాత అన్ని మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇక 2019 ప్రపంచ కప్ లో ఆఫ్ఘాన్ కు గెలుపు ఎలా ఉంటుందో తెలీదు. ఇక తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో తన తొలి విజయంతో ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్లకే షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 49.5 ఓవర్లలకు 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఓపెనర్ గుర్భాజ్ (80) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు.. ఇక్రమ్ అలీఖిల్(58) రన్స్ తో రాణించాడు. దీంతో జట్టు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.
అనంతరం 285 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 215 పరుగులకే చాపచుట్టేసి.. 69 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఛాంపియన్ టీమ్ ను ఆఫ్ఘాన్ స్పిన్నర్లు ఓ ఆటాడుకున్నారు. పది వికెట్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లు తీయడం విశేషం. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. హ్యారీ బ్రూక్ ఒక్కడే నిలబడినా అతడికి సహకరించే వాళ్లు లేరు. చివరికి 66 పరుగులు చేసిన బ్రూక్ ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ విజయంలో కీలకపాత్ర పోషించింది మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్ కావడం గమనార్హం. ఇంగ్లీష్ జట్టు ఓటమికి ఆ జట్టు మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ కూడా ఓ కారణం. గతంలో ఇంగ్లాండ్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన ట్రాట్.. 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతడు ఆఫ్గాన్ జట్టు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్ల ఆటతీరు అతడికి అనుభవమే కావడంతో.. ఆ అనుభవాన్ని అంతా ఈ మ్యాచ్ లో ఉపయోగించి.. ఇంగ్లాండ్ జట్టు ఓటమికి కారణం అయ్యాడు.
Trott was the leading run-getter for England in 2011 World Cup in India.
Today – Trott is the coach of Afghanistan when they beat England in 2023 World Cup in India. pic.twitter.com/uoWmky4CXM
— Johns. (@CricCrazyJohns) October 15, 2023