Joe Root: రూట్ క్రేజీ రికార్డ్.. ఇది మామూలు ఘనత కాదు!

Joe Root, ENG vs SL, Alastair Cook: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఫీట్​గా దీన్ని చెప్పొచ్చు.

Joe Root, ENG vs SL, Alastair Cook: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఫీట్​గా దీన్ని చెప్పొచ్చు.

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇది అలాంటి ఇలాంటి ఘనత కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఫీట్. దీనికి దగ్గర్లో రావడం కూడా కష్టమే. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సూపర్బ్ సెంచరీ బాదాడీ ఇంగ్లీష్ బ్యాటర్. 121 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అతడి కెరీర్​లో ఇది 34వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు బాదిన అలిస్టర్ కుక్ (33 సెంచరీలు) రికార్డును అతడు బ్రేక్ చేశాడు. అలాగే అత్యధిక సెంచరీల లిస్ట్​లో విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు. వీళ్లిద్దరూ చెరో 34 సెంచరీలు బాదారు.

రూట్ సెంచరీ మార్క్​ను అందుకోగానే స్టేడియంలోని గ్యాలరీలో ఉన్న అతడి తండ్రి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ప్రేక్షకులంతా లేచి చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ రూట్​ను అభినందించారు. కామెంట్రీ బాక్స్​లో ఉన్న అలిస్టర్ కుక్​ కూడా రూట్​ను మెచ్చుకున్నాడు. 34 సెంచరీల మార్క్​ను చేరుకునేందుకు రూట్​కు 265 ఇన్నింగ్స్​లు పట్టింది. 2012 నుంచి 2017 మధ్య ఐదేళ్ల కాలంలో 17 టెస్ట్ సెంచరీలు బాదాడు రూట్. అయితే 2021 నుంచి 2024 మధ్య మూడేళ్ల వ్యవధిలో 17 సెంచరీలు కొట్టడం విశేషం. దీన్ని బట్టే అతడి ఫామ్, కన్​సిస్టెన్సీ ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ స్పెషలిస్ట్ నుంచి ఇప్పుడు ఆ ఫార్మాట్​లో మోడర్న్ గ్రేట్​గా నిలిచే దిశగా అతడు పరుగులు తీస్తున్నాడు.

ప్రస్తుత క్రికెట్​లో రూట్ తర్వాత అత్యధిక టెస్ట్ సెంచరీల లిస్ట్​లో కేన్ విలియమ్సన్ (32 సెంచరీలు) ఉన్నాడు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (29 సెంచరీలు) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కానీ గత కొన్నాళ్లుగా లాంగ్ ఫార్మాట్​లో విరాట్ బ్యాట్ పెద్దగా గర్జించడం లేదు. అయితే బంగ్లాదేశ్ సిరీస్​తో సుదీర్ఘ టెస్ట్ సీజన్​ను ఆరంభించనుంది రోహిత్ సేన. కాబట్టి రూట్, విలియమ్సన్​తో సమానంగా టెస్టుల్లో పరుగులు తీయాలంటే కోహ్లీ విశ్వరూపం చూపించాల్సిందే. కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తూ పోతే సెంచరీలు, రికార్డులు అవే వస్తాయి. ఇక, రూట్ సెంచరీతో లంకతో రెండో టెస్ట్​లో ఇంగ్లండ్ పటిష్ట స్థానానికి చేరుకుంది. రెండో ఇన్నింగ్స్​లో ఆ టీమ్ 251 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం 2 వికెట్లకు 53 పరుగులతో ఉన్న శ్రీలంక.. ఈ మ్యాచ్​లో నెగ్గాలంటే మరో 429 పరుగులు చేయాల్సి ఉంది. మరి.. రూట్ సాధించిన అరుదైన ఘనతపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments