iDreamPost
android-app
ios-app

వీడియో: శ్రీలంకలో రచ్చరచ్చ చేసిన భారత మహిళా క్రికెటర్లు! చూసి తీరాల్సిందే..

  • Published Jul 26, 2024 | 6:46 PM Updated Updated Jul 26, 2024 | 6:46 PM

Jemimah Rodrigues, Team India: ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ ప్రస్తుతం ఆసియా కప్‌లో అదరగొడుతోంది. ఆ సంతోషంలో తాజాగా టీమ్‌ బస్‌లో రచ్చరచ్చ చేశారు. ఆ హంగామా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Jemimah Rodrigues, Team India: ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ ప్రస్తుతం ఆసియా కప్‌లో అదరగొడుతోంది. ఆ సంతోషంలో తాజాగా టీమ్‌ బస్‌లో రచ్చరచ్చ చేశారు. ఆ హంగామా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 26, 2024 | 6:46 PMUpdated Jul 26, 2024 | 6:46 PM
వీడియో: శ్రీలంకలో రచ్చరచ్చ చేసిన భారత మహిళా క్రికెటర్లు! చూసి తీరాల్సిందే..

ప్రస్తుతం భారత మహిళా క్రికెట్‌ జట్టు శ్రీలంకలో ఉంది. ఉమెన్స్‌ ఆసియా కప్‌ 2024 శ్రీలంక వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన అదరగొడుతోంది. పాకిస్థాన్‌, నేపాల్‌, యూఏఈ జట్లను ఓడించి.. సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో నేడు(శుక్రవారం) దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత మహిళా క్రికెటర్లు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

శ్రీలంకలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్తున్న సమయంలో.. టీమిండియా క్రికెటర్లు సరదాగా పాటలు పాడుతూ ఎంజయ్‌ చేశారు. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ అయితే.. ఏకంగా గిటార్‌ ప్లే చేస్తూ.. పాటలు పాడింది. ఆమెను మిగతా క్రికెటర్లు కూడా అనుసరించారు. అందరూ హిందీ పాటలు పాడుతూ.. బస్సులో రచ్చ రచ్చ చేశారు. వారి ఎంజాయ్‌మెంట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మహిళా క్రికెటర్లలో.. క్రికెట్‌ కాకుండా ఇంత టాలెంట్‌ ఉందా అంటూ క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఆసియా కప్‌ సెమీ ఫైనల్‌మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కానీ, టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. కేవలం 44 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. పీలకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ సుల్తానా మాత్రమే 23 పరుగులతో మెరుగ్గా ఆడుతోంది. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే అవుట్‌ అయ్యారు. ఈ మ్యాచ్‌ గెలిచి.. ఫైనల్లో కూడా విజయ ఢంకా మోగించి.. ఆసియా కప్‌ సాధించాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. మరి మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. ఉమెన్‌ క్రికెటర్లు చేసిన రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.