iDreamPost

10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 27 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసిన ఉనద్కత్

  • Author Soma Sekhar Published - 10:43 AM, Wed - 2 August 23
  • Author Soma Sekhar Published - 10:43 AM, Wed - 2 August 23
10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 27 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసిన ఉనద్కత్

వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారీ మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. సిరీస్ లో కీలక మ్యాచ్ అయినప్పటికీ టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగాలకే మెుగ్గుచూపింది. సీనియర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లతో పాటుగా మరికొందరికి విశ్రాంతిని ఇచ్చింది. ఇక బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ప్లేస్ లో జట్టులోకి వచ్చాడు వెటరన్ పేసర్ జైదేవ్ ఉనద్కత్. దాదాపు 10 సంవత్సరాల తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ సీనియర్ బౌలర్. ఇటీవలే టెస్టుల్లోకి వచ్చిన ఉనద్కత్.. తాజాగా వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే 10 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జైదేవ్.. 27 ఏళ్ల రాబిన్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సర్ఫ్రైజింగ్ ప్లేయింగ్ ఎలెవన్ తో బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు విశ్రాంతి తీసుకోవడంతో.. తాత్కాలిక కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. వీరి స్థానంలో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగాడు. ఇక పేసర్ ఉమ్రాన్ మాలిక్ స్థానంలో జట్టులోకి వచ్చాడు జైదేవ్ ఉనద్కత్. దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు ఈ పేసర్. విండీస్ తో జరిగిన మూడో వన్డేలో ఓ వికెట్ తీశాడు.

కాగా.. 2013లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేనే ఉనద్కత్ ఆడిన చివరి వన్డే మ్యాచ్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో 10 ఏళ్ల తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఉనద్కత్ 27 ఏళ్ల అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ఎక్కువ కాలం గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా ఉనద్కత్ నిలిచాడు. ఇతడు దాదాపు 9 సంవత్సరాల 252 రోజులు ఇండియాకు వన్డేలు ఆడలేదు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ పేరిట ఉండేది.

ఈ క్రమంలోనే రాబిన్ సింగ్ టీమిండియాకు వన్డేలు ఆడకుండా 7 సంవత్సరాల 230 రోజులు ఉన్నాడు. ఇక ఈ లిస్ట్ లో అమిత్ మిశ్రా (6 ఏళ్ల 160 రోజులు), పార్థీవ్ పటేల్ (6 ఏళ్ల 133 రోజుల)తో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరపున 8 వన్డేల్లో మాత్రమే ప్రాతినిథ్యం వహించాడు ఉనద్కత్. మరి 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ.. 27 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన ఉనద్కత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విండీస్ పై విజయం.. టీమిండియా అరుదైన ఘనత! ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి