iDreamPost
android-app
ios-app

వీడియో: విండీస్‌ బౌలర్‌ స్టన్నింగ్‌ డెలవరీకి తలొంచిన సౌతాఫ్రికా ఓపెనర్‌!

  • Published Aug 16, 2024 | 4:03 PM Updated Updated Aug 16, 2024 | 4:03 PM

Jayden Seales, Tony de Zorzi, WI vs SA: సరైన లైన్‌ అండ్‌ లెంత్‌లో బాల్‌ వేయాలనే గానీ,.. వికెట్లను గాల్లో పల్టీలు కొట్టించవచ్చు. అది ఆ టాలెంట్‌ అందరికీ ఉండదు. తాజాగా వెస్టిండీస్‌ యువ పేసర్‌ అలాంటి సూపర్‌ డెవలరీతో అదరగొట్టాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Jayden Seales, Tony de Zorzi, WI vs SA: సరైన లైన్‌ అండ్‌ లెంత్‌లో బాల్‌ వేయాలనే గానీ,.. వికెట్లను గాల్లో పల్టీలు కొట్టించవచ్చు. అది ఆ టాలెంట్‌ అందరికీ ఉండదు. తాజాగా వెస్టిండీస్‌ యువ పేసర్‌ అలాంటి సూపర్‌ డెవలరీతో అదరగొట్టాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 16, 2024 | 4:03 PMUpdated Aug 16, 2024 | 4:03 PM
వీడియో: విండీస్‌ బౌలర్‌ స్టన్నింగ్‌ డెలవరీకి తలొంచిన సౌతాఫ్రికా ఓపెనర్‌!

గతంలో ఫాస్ట్‌ బౌలింగ్‌కు పెట్టింది పేరు వెస్టిండీస్‌. హేమాహేమీ బ్యాటర్లను వణికించే రేంజ్‌లో ఉండేది కరేబియన్‌ బౌలింగ్‌. అలాంటి రోజులు మళ్లీ వచ్చాయా? అనిపిస్తోంది తాజాగా విండీస్‌ యంగ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ యూనిట్‌ని చూస్తుంటే.. షమర్‌ జోసెఫ్‌, జేడెన్ సీల్స్ బౌలింగ్‌కు సౌతాఫ్రికా బ్యాటర్లు వణికిపోతున్నారు. వెస్టిండీస్‌-సౌతాఫ్రికా మధ్య గయానా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విండీస్‌ బౌలర్లు నిమ్ములుచిమ్ముతున్నారు. షమర్‌ జోసెఫ్‌, జేడెన్ సీల్స్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక.. ప్రొటీస్‌ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా జేడెన్ సీల్స్ వేసిన బాల్‌కు గాల్లో వికెట్‌ పల్టీలు కొట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఊహించని షాక్‌ ఇచ్చాడు. ప్రొటీస్‌ ఓపెనర్‌ టోనీ డి జోర్జి ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ మూడో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. జేడెన్‌ వేసిన సూపర్‌ డెలవరీకి టోనీ డి జోర్జి వద్ద అసలు సమాధానమే లేకపోయింది. అతను వేసిన వేగానికి ఆఫ్‌ స్టంప్‌ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టకుంటూ.. చాలా దూరం వెళ్లిపడింది. టోనీ డి జోర్జి అవుట్‌ అవ్వడంతో.. కేవలం 8 పరుగులకే సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే షమర్‌ జోసెఫ్‌ సైతం మరో ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ను కూడా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

Windies bowler stunning delivery

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి.. కేవలం 160 పరుగులకే ఆలౌట్‌ అయింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ 26, బెండింగ్‌హామ్‌ 28, డేన్ పీడ్ట్ 38, నాంద్రే బర్గర్ 23 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. కెప్టెన్‌ బవుమాతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ అయ్యారు. వెస్టిండీస్‌ బౌలర్లలో షమర్‌ జోసెఫ్‌ 5, జేడెన్‌ సీల్స్‌ 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన వెస్టిండీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. జెసన్‌ హోల్డర్‌ 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో జేడెన్‌ సీల్స్‌ సూపర్‌ డెలవరీకి వికెట్‌ గాల్లో పల్టీలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.