అప్పటి వరకు రోహితే కెప్టెన్‌గా ఉంటాడు! తేల్చిచెప్పేసిన BCCI కార్యదర్శి

Jay Shah, Rohit Sharma, BCCI: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయంలో బీసీసీఐ కార్యదర్శి జై షా అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు. ఒక్క దెబ్బకు రోహిత్‌పై వస్తున్న పుకార్లకుచెక్‌ పెట్టాడు. మరి ఆ క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jay Shah, Rohit Sharma, BCCI: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయంలో బీసీసీఐ కార్యదర్శి జై షా అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు. ఒక్క దెబ్బకు రోహిత్‌పై వస్తున్న పుకార్లకుచెక్‌ పెట్టాడు. మరి ఆ క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కంటే ముందు.. రోహిత్‌ శర్మ టీ20 కెరీర్‌పై చాలా విమర్శలు వచ్చాయి. పైగా ఐపీఎల్‌ 2024లో ము​ంబై ఇండియన్స్‌ ఓపెనర్‌గా రోహిత్‌ పెద్దగా రాణించకపోవడంతో.. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ కూడా పోయినట్లే అని కొంతమంది అన్నారు. అయితే.. ఒక్కసారి టీ20 వరల్డ్‌ కప్‌ మొదలవ్వగానే తన సత్తా ఏంటో చూపిస్తూ.. బ్యాటర్‌గా దుమ్మురేపుతూ.. కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి నడిపించాడు రోహిత్‌ శర్మ. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు రోహిత్‌ కెప్టెన్సీ విషయంలో వచ్చిన విమర్శలకు బీసీసీఐ కార్యదర్శి ఒక్క స్టేట్‌మెంట్‌తో పుల్‌స్టాప్‌ పెట్టిన విషయం తెలిసిందే.

‘రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ ఆడుతుంది, జూన్‌ 29న బార్బడోస్‌ వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ గెలుస్తున్నాం’ అని జైషా చేసిన వ్యాఖ్యతో రోహిత్‌ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే పుకార్లకు తెరపడింది. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత.. మరోసారి రోహిత్‌ శర్మ కెప్టెన్సీ విషయంలో రూమర్లు చెలరేగాయి. టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పిస్తారని, లేదు లేదు వన్డేల నుంచి కెప్టెన్‌గా తప్పించి.. కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా కొనసాగిస్తారని, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉండాలనే ఫార్మూలను బీసీసీఐ ఫాలో అవుతుందనే గుసగుసలు వినిపించాయి.

ఈ పుకార్లకు కూడా ఒక్క దెబ్బతో పుల్‌స్టాప్‌ పెట్టేశాడు బీసీసీఐ కార్యదర్శి జై షా. ‘రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలుస్తామనే నమ్మకం తనకు ఉంది’ అంటూ ప్రకటించాడు. ఈ ప్రకటనతో 2025లో జరగబోయే డబ్య్లూటీసీ(ఒక వేళ ఇండియా ఫైనల్‌కి వెళ్తే), పాకిస్థాన్‌ వేదికగా జరగబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 వరకు రోహిత్‌ శర్మనే భారత జట్టు కెప్టెన్‌గా విషయం తేలిపోయింది. టీ20లకు రోహిత్‌ శర్మ గుడ్‌బై చెప్పినా.. వన్డే, టెస్టుల్లో రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. మరి టీ20లకు ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారో చూడాలి. మరి రోహిత్‌ శర్మ కెప్టెన్సీ విషయంలో జైషా ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments