Jay Shah Reacted On Mayank Yadav Future: ఆ ప్లేయర్ టీమ్​లో ఉంటాడో లేదో చెప్పలేను.. జైషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఆ ప్లేయర్ టీమ్​లో ఉంటాడో లేదో చెప్పలేను.. జైషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Jay Shah On Bangladesh Series: భారత జట్టు తదుపరి సిరీస్​లపై బీసీసీఐ సెక్రెటరీ జైషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఎదురులేదన్నారు. ఇదే క్రమంలో ఓ ప్లేయర్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jay Shah On Bangladesh Series: భారత జట్టు తదుపరి సిరీస్​లపై బీసీసీఐ సెక్రెటరీ జైషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియాకు ఎదురులేదన్నారు. ఇదే క్రమంలో ఓ ప్లేయర్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత క్రికెట్ బోర్డు సెక్రెటరీ జైషా ప్రతి విషయంపై నిక్కచ్చిగా సమాధానం ఇస్తారు. ఏది ఉన్నా డైరెక్ట్​గా చెప్పేస్తారు. అద్భుతమైన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్న ఆయన.. ఇండియన్ క్రికెట్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఇతర దేశాల బోర్డులతోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. సేమ్ టైమ్​ ఐసీసీలోనూ భారత్ బలం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి జైషా తాజాగా భారత క్రికెట్​కు సంబంధించిన పలు విషయాలపై రియాక్ట్ అయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ దగ్గర నుంచి టీమిండియా, ఐపీఎల్-2025 వరకు చాలా విషయాలపై ఆయన తన అభిప్రాయాలను చెప్పారు. ఇదే క్రమంలో ఓ ప్లేయర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఆటగాడు టీమ్​లో కచ్చితంగా ఉంటాడని తాను చెప్పలేనని అన్నారు.

జైషా మాట్లాడింది మరెవరి గురించో కాదు.. ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ యాదవ్. 156 కిలోమీటర్ల బుల్లెట్ స్పీడ్​తో బౌలింగ్ చేస్తూ ఈ ఏడాది క్యాష్​ రిచ్​ లీగ్​లో బ్యాటర్లను పోయించాడు మయాంక్. సరైన లైన్ అండ్ లెంగ్త్, లీథల్ పేస్​తో​ బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. అలాంటోడు గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. భారత జట్టులోకి పక్కా ఎంట్రీ ఇస్తాడనుకుంటే కుదరలేదు. ఇంజ్యురీతో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)లో పునరావాసంలో ఉంటున్న ఈ ప్లేయర్ బంగ్లాదేశ్​తో జరిగే టెస్ట్ సిరీస్ లేదా ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో డెబ్యూ ఇచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. దీనిపై జైషా రియాక్ట్ అయ్యారు. మయాంక్ యాదవ్ పక్కా టీమ్​లో ఉంటాడని చెప్పలేనని.. కానీ అతడు సూపర్బ్ బౌలర్ అని మెచ్చుకున్నారు.

‘మయాంక్ యాదవ్ టీమ్​లో ఉంటాడో లేదో చెప్పలేను. అతడు పక్కా జట్టులో ఉంటాడనే గ్యారెంటీ లేదు. కాబట్టి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేను. కానీ మయాంక్ టాలెంట్​ను మెచ్చుకోకుండా ఉండలేను. అతడు అద్భుతమైన పేసర్. మేం అతడి విషయలో జాగ్రత్తలు తీసుకొని పర్యవేక్షిస్తున్నాం. మయాంక్ ఎన్​ఏసీలో ఉన్నాడు’ అని జైషా చెప్పుకొచ్చారు. ఇక, ఐపీఎల్-2024లో నాలుగు మ్యాచ్​లు ఆడిన మయాంక్ మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించాడు. లక్నో సూపర్​జియాంట్స్ తరఫున ఆడిన ఈ కుర్ర స్పీడ్​స్టర్ 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ సీజన్​లో అదే ఫాస్టెస్ట్ బాల్ కావడం విశేషం. అలాంటోడు ఇంజ్యురీ బారిన పడకపోతే ఈపాటికి టీమిండియాకు ఆడేవాడు. మరి.. మయాంక్ కమ్​బ్యాక్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments