iDreamPost
android-app
ios-app

ఇలా చేయమని గంభీర్‌కి చెప్పడానికి నేను ఎవర్ని?: జైషా

  • Published Aug 16, 2024 | 4:41 PM Updated Updated Aug 16, 2024 | 4:41 PM

Jay Shah, Gautam Gambhir: కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు మద్దతుగా బీసీసీఐ సెక్రటరీ జైషా షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Jay Shah, Gautam Gambhir: కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు మద్దతుగా బీసీసీఐ సెక్రటరీ జైషా షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 16, 2024 | 4:41 PMUpdated Aug 16, 2024 | 4:41 PM
ఇలా చేయమని గంభీర్‌కి చెప్పడానికి నేను ఎవర్ని?: జైషా

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు సిరీస్‌లు ఆడిండి భారత జట్టు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ ఆడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా టీ20, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లు ఆడింది టీమిండియా. గంభీర్‌కు హెడ్‌ కోచ్‌గా టీ20 సిరీస్‌ ఫస్ట్‌ టాస్క్‌గా నిలిచింది. తొలి పరీక్షలో గంభీర్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.. కొత్త కెప్టెన్‌, యంగ్‌ ప్లేయర్లతో ఉన్న యంగ్‌ టీమిండియాను విజయపథంలో నడిపించాడు. శ్రీలంకను 3-0తో ఓడించి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది సూర్య సేన. కానీ, వన్డే సిరీస్‌లో మాత్రం గంభీర్‌ అంచనాలను అందుకోలేకపోయాడు.

దీంతో.. గంభీర్‌ కొన్ని ఫార్మాట్లకే హెడ్‌ కోచ్‌గా పరిమితం చేస్తారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ అంశంపై బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇస్తూ.. ఫలానా ఫార్మాట్‌ను టచ్‌ చేయొద్దని చెప్పడానికి నేను ఎవర్ని అంటూ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించాం.. అతను కూడా మూడు ఫార్మాట్లలో ఇండియాను ముందుకు నడిపించేందుకు మంచి ఉత్సాహంతో ఉన్నాడు. అందుకే.. ఈ ఫార్మాట్స్‌కే కోచ్‌వి, ఆ ఫార్మాట్‌ను నువ్వు టచ్‌ చేయొద్దని గంభీర్‌కు మేం చెప్పాం అంటూ జైషా స్పష్టం చేశాడు.

అయితే.. హెడ్‌ కోచ్‌గా గంభీర్‌కు అసలు పరీక్ష టెస్టు ఫార్మాట్‌లో ఎదురవుతుందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో భారత జట్టు సిరీస్‌లు ఆడనుండి. పైగా వచ్చే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉంటుంది. గతం రెండు ఫైనల్స్‌ ఆడిన టీమిండియా.. ఛాంపియన్‌గా మాత్రం నిలువలేకపోయింది. 2021లో న్యూజిలాండ్‌, 2023లో ఆస్ట్రేలియా మనపై గెలిచి.. డబ్ల్యూటీసీ విన్నర్స్‌గా నిలిచాయి. మరి గంభీర్‌ ఆ లోటు తీరుస్తాడో లేదో చూడాలి. మరి గంభీర్‌ అన్ని ఫార్మాట్లకు కోచ్‌ అని జైషా క్లారిటీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.