టీ20 వరల్డ్‌ కప్‌లో వికెట్ల పంట పండించేది ఆ భారత బౌలరే: పాంటింగ్‌

Jasprit Bumrah, T20 World Cup 2024, Ricky Ponting: టీమిండియాలోని ఓ స్టార్‌ బౌలర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఎవరు అడ్డుకోలేరంటూ.. ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ పాంటింగ్‌ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Jasprit Bumrah, T20 World Cup 2024, Ricky Ponting: టీమిండియాలోని ఓ స్టార్‌ బౌలర్‌ను టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఎవరు అడ్డుకోలేరంటూ.. ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ పాంటింగ్‌ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ రింకీ పాంటింగ్‌ అన్ని టీమ్స్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ టీమిండియా బౌలర్‌ను అడ్డుకోవడం కష్టమని.. అతనే ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. పాంటింగ్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ ఇలాంటి భారీ స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకుపుట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకీ పాంటింగ్‌ ఎవరి పేరు చెప్పాడో తెలుసా?.. టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా. అతని గురించి కొత్తగా పాంటింగ్‌ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. బుమ్రా పేరు వింటే చాలా చాలా టీమ్స్‌ భయపడిపోతాయి. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీకి ముందు పాంటింగ్‌ మరోసారి అన్ని టీమ్స్‌కు డేంజర్‌ బెల్స్‌ మోగించాడు.

ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీలో జస్ప్రీత్ బుమ్రా టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబర్చి వస్తున్నాడు. అలాగే అతని ఎకానమీ రేటు కూడా 7 కంటే తక్కువగా ఉంది. పైగా బుమ్రా హార్డ్‌ ఓవర్స్‌ వేస్తాడు. కొత్త బంతితో, డెత్‌ ఓవర్స్‌, టీమ్‌కు వికెట్లు అవసరమైనప్పుడు బుమ్రా బౌలింగ్‌కి వస్తాడు. ఇలాంటి సమయంలో అతనికి వికెట్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నా ఛాయిస్‌ బుమ్రా’ అంటూ పాంటింగ్‌ పేర్కొన్నాడు.

తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2024లో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రదర్శన బాగాలేకపోయినా.. ఆ టీమ్‌లో ఆడిన జస్ప్రీత్‌ బుమ్రా మాత్రం వ్యక్తిగతంగా మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 6.48 ఎకానమీ రేట్‌తో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. పైగా చాలా మ్యాచ్‌లలో కొత్త బంతిని బుమ్రా చేతికి ఇవ్వలేదు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా అలా ఇచ్చి ఉంటే.. బుమ్రా ఖాతాలో ఇంకా చాలా వికెట్లు ఉండేవి. ఇకపోతే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో బుమ్రా వెన్ను నొప్పితో ఆడలేదు. అప్పుడు బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మాత్రం.. బుమ్రా రెట్టించిన ఉత్సాహం, ఫామ్‌తో టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించాలనే కసితో బరిలోకి దిగుతున్నాడు. మరి బుమ్రా టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలుస్తాడని పాంటింగ్‌ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments