SNP
Brett Lee, Jasprit Bumrah: ప్రపంచపు అత్యుత్తమ బౌలర్ అతనేనంటూ ఓ భారత బౌలర్ పేరు ప్రకటించిన ఆసీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ. మరి అతను ఎవరి పేరు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Brett Lee, Jasprit Bumrah: ప్రపంచపు అత్యుత్తమ బౌలర్ అతనేనంటూ ఓ భారత బౌలర్ పేరు ప్రకటించిన ఆసీస్ దిగ్గజ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ. మరి అతను ఎవరి పేరు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ పేసర్ బ్రెట్ లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ప్రైమ్‌టైమ్‌లో ఎంతో మంది హేమాహేమీ బ్యాటర్లను వణికించిన బౌలర్. తన స్టైలిష్ బౌలింగ్ యాక్షన్‌తో పాటు, బుల్లెట్‌లా దూసుకొచ్చే బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు. చాలా కాలం పాటు ప్రపంచంలోనే ది బెస్ట్ బౌలర్‌గా ప్రఖ్యాతి గాంచిన బ్రెట్ లీ.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో వరల్డ్స్ బెస్ట్ బౌలర్ ఎవరో చెప్పేశాడు. బ్రెట్ లీ చెప్పిన పేరు వింటే భారత క్రికెట్ అభిమానుల హృదయాలు ఉప్పొంగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ బౌలర్ అంటూ టీమిండియా స్టార్ బౌలర్ పేరు చెప్పాడు బ్రెట్ లీ.
ఇంతకీ బ్రెట్ లీ చెప్పింది ఎవరి గురించి అంటే.. టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా గురించే. ప్రస్తుతం వరల్డ్స్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంటూ పేర్కొన్నాడు బ్రెట్ లీ. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో బుమ్రా ఎలాంటి ప్రదర్శన చేశాడో మనమంతా చూశాం. 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి.. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. నిజం చెప్పాలంటే.. బ్యాటింగ్ ప్రధాన బలంగా ఉన్న టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2024లో ప్రధాన బ్యాటర్లు తడబడినా, తక్కువ స్కోర్లకు పరిమితమైనా.. ఛాంపియన్‌గా నిలిచింది అంటే అందుకు కారణం బుమ్రానే.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తక్కువ స్కోర్ చేసినా.. మ్యాచ్ గెలిపించాడు బుమ్రా. అలాగే సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వాళ్ల విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే అవసరమైన సయమంలో చివరి ఐదు ఓవర్లలో బుమ్రా రెండు ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పైగా ఒక వికెట్ కూడా తీసి.. మ్యాచ్‌ను ఇండియాపై తిప్పేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో పాటు.. అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రానే ప్రపంచపు అత్యుత్తమ బౌలర్ అంటూ బ్రెట్ లీ స్పష్టం చేశాడు. మరి బుమ్రాను వరల్డ్స్ బెస్ట్ బౌలర్ అని దిగ్గజ మాజీ పేసర్ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Brett Lee has chosen his pick for the “best bowler in the world”. The former Australian pacer believes his choice is the best in all three formats of the game. Indian fans should be happy that Lee has chosen none other than Jasprit Bumrah.#JaspritBumrah #Brettlee pic.twitter.com/76f5UKuWzB
— Sayyad Nag Pasha (@nag_pasha) July 11, 2024