SNP
SNP
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నా.. తర్వాత తిరిగి పుంజుకుని వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-మిచెల్ మార్ష్ అయితే.. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా వార్నర్ అయితే.. టీమిండియా బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 96 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. వీరి తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. స్మిత్ 74, లబుషేన్ 72 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఇక తొలి రెండు వన్డేలు ఆడన డేంజరస్ బ్యారట్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రం ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. నిజానికి మ్యాక్సీ విఫలం అయ్యాడు అనేకంటే.. టీమిండియా స్టార్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బాల్‌తో మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్‌కు చేర్చాడనే చెప్పాలి. 38 ఓవర్లకే 280కి పైగా పరుగులు చేసి మంచి జోష్‌లో ఉన్న టైమ్‌లో.. బుమ్రా బౌలింగ్‌కి వచ్చి.. ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. 39వ ఓవర్ చివరి బంతికి అద్భుతమైన యార్కర్‌తో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు బుమ్రా. 141 కిలో మీటర్ల వేగంతో వేసిన ఆ యార్కర్‌కు మ్యాక్సీ వద్ద ఎలాంటి జవాబు లేకుండా పోయింది. అవుటైన తర్వాత మ్యాక్స్ షాక్ అవుతూ పెవిలియన్ బాట పట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తమకు ఎంతో అచ్చి వచ్చి రాజ్‌కోట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగిపోయారు. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకపోయినా.. ఆస్ట్రేలియాకు ఇంత స్కోర్ వచ్చింది. టాప్ ఆర్డర్‌లోని నలుగురు బ్యాటర్లు కూడా హాఫ్ సెంచరీలో రాణించడంతో భారీ స్కోర్ సాధ్యమైంది. వార్నర్ 56, మిచెల్ మార్ష్ 96, స్మిత్ 74, లబుషేన్ 72 పరుగులతో రాణించారు. అలెక్స్ క్యారీ 11, మ్యాక్స్‌వెల్ 5, కామెరున్ గ్రీన్ 9 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యారు. కెప్టెన్ కమిన్స్ 19, మిచెల్ స్టార్క్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2 వికెట్లతో రాణించారు. సిరాజ్, ప్రసిద్ధ్ చెరో వికెట్ తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ వికెట్లు తీయకున్నా.. 10 ఓవర్లలో కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లంతా భారీగానే పరుగులు ఇచ్చారు. మరి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌తో పాటు, మ్యాక్స్‌వెల్‌ను బుమ్రా అవుట్ చేసిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝙔𝙊𝙍𝙆𝙀𝘿!
What a delivery that from @Jaspritbumrah93 to dismiss Glenn Maxwell 🔥🔥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/6XzupmqMec
— BCCI (@BCCI) September 27, 2023
ఇదీ చదవండి: VIDEO: రన్నప్‌లో కిందపడిన బౌలర్ టవల్! బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్