iDreamPost
android-app
ios-app

VIDEO: పాక్‌ బౌలర్‌కు మిస్‌ అయిన వికెట్‌.. నిరాశపడ్డ బుమ్రా!

  • Published Sep 02, 2023 | 10:14 PM Updated Updated Sep 02, 2023 | 10:14 PM
  • Published Sep 02, 2023 | 10:14 PMUpdated Sep 02, 2023 | 10:14 PM
VIDEO: పాక్‌ బౌలర్‌కు మిస్‌ అయిన వికెట్‌.. నిరాశపడ్డ బుమ్రా!

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడి నిలబడింది. పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ చెలరేగడంతో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తక్కువ స్కోర్‌కే అవుటైనా.. ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నారు. మొత్తం మీద భారత్‌ 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ పేసర్లు నిప్పులు చెరిగారు. 10కి 10 వికెట్లు పేసర్లకే దక్కడంతోనే అర్థం అవుతుంది, వాళ్లు ఏ రేంజ్‌లో బౌలింగ్‌ చేశారో.

అయితే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ యువ బౌలర్‌ నసీమ్‌ షా బౌలింగ్‌ చూసి బుమ్రా సంబరపడిపోయాడు. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో.. నసీమ్‌ షా ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ వేస్తున్న క్రమంలో ఓ లో ఫుల్‌ టాస్‌ బాల్‌ వేశాడు. దాన్ని ఆడటంలో ఇషాన్‌ పూర్తిగా విఫలం అయ్యాడు. ఆ బాల్‌ గాల్లోనే స్వింగ్‌ అవ్వడంతో వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ డైవ్‌ చేస్తూ మరీ అందుకోవాల్సి వచ్చింది. నసీమ్‌ వేసిన ఆ సూపర్‌ డెవలరీ చూసి.. పాక్‌ ఆటగాళ్లే కాదు. టీమిండియా బౌలర్‌ బుమ్రా సైతం మురిసిపోయాడు.

కొద్దిలో ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ మిస్‌ అయిందని.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ నవ్వులు చిందిస్తే.. డ్రెస్సింగ్‌ రూమ్‌ వద్ద కూర్చోని మ్యాచ్‌ చూస్తున్న బుమ్రా కూడా రెండు చేతులతో తల పట్టుకుని.. ఊహించని రియాక్షన్‌ ఇచ్చాడు. తర్వాత నవ్వుకుంటూ వెనుక కూర్చున్న రోహిత్‌ వైపు చూశాడు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్‌​కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతైనా బుమ్రా కూడా ఓ స్పీడ్‌ బౌలర్‌ కావడంతో.. అద్భుతమైన బాల్‌కు వికెట్‌ మిస్‌ అయినప్పుడు ఏ బౌలర్‌ రియాక్షన్‌ అయినా ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరి కిందున్న వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet