SNP
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ నుంచి ఇంటికి వచ్చేశాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2023లో ఈ నెల 2న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఆడిన బుమ్రా.. ఆ మ్యాచ్ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఇలా ఉన్నపళంగా బుమ్రా జట్టుకు దూరం అవ్వడం, ఇండియాకు తిరిగి వచ్చేయడంపై భారత క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే గాయంతో జట్టుకు దూరమై దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా.. ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్‌కు ముందు మళ్లీ గాయపడ్డాడా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బుమ్రా లేకపోతే.. టీమిండియా బౌలింగ్ ఎటాక్ బాగా బలహీనమైపోతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అసలు ఇంత సడెన్‌గా బుమ్రా.. ఆసియా కప్ నుంచి ఇంటికి ఎందుకు వచ్చాడా? అనే విషయంపైనే క్రికెట్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. బుమ్రా కుటుంబసభ్యులు ఎవరైనా అనారోగ్యం బారినపడ్డారా? లేక ఇంకేమైనా జరిగిందా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. బుమ్రా టీమిండియాను వీడి ఇంటికి రావడానికి భయపడాల్సినంత కారణం ఏం లేదని తెలుస్తోంది. గాయంతో అయితే బుమ్రా ఇంటికి రాలేదని స్పష్టం కావడంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతని భార్య, స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఆమె డెలవరీ టైమ్ దగ్గర పడటంతో ఆ సమయంలో బుమ్రా ఆమెతో ఉండాలని ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఎలాగో నేపాల్‌తో మ్యాచ్‌లో బుమ్రకు విశ్రాంతి ఇస్తారు కనుక.. ఆ టైమ్‌లో ఎంతో అపూర్వమైన సమయంలో తన భార్యతో ఉండాలని నిర్ణయించుకుని బుమ్రా స్వదేశానికి వచ్చాడు. డెవలరీ అవ్వగానే తిరిగి శ్రీలంకకు పయనమవుతాడు. ఆసియా కప్ 2023లో మిగిలిన మ్యాచ్‌లు ఆడేస్తాడు. మరి బుమ్రా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah left for Mumbai for the birth of his first child. [News18]
He will be available from Super 4. pic.twitter.com/uOAF0pfDlU
— Johns. (@CricCrazyJohns) September 3, 2023
Many congratulations to Jasprit Bumrah and Sanjana Ganesan who are expecting the birth of their first child. pic.twitter.com/72F4Q723RI
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2023
ఇదీ చదవండి: IND vs PAK: మనసులు గెలుచుకున్న పాక్ క్రికెటర్ షాదాబ్!