Nidhan
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్-2023లో టాప్ బ్యాటర్లకు కూడా పోయించిన అతడు.. అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లతో చెడుగుడు ఆడుకుంటున్నాడు.
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్-2023లో టాప్ బ్యాటర్లకు కూడా పోయించిన అతడు.. అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లతో చెడుగుడు ఆడుకుంటున్నాడు.
Nidhan
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఏడాది కాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ దుమ్మురేపుతూ ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అపోజిషన్ బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. బుల్లెట్ స్పీడ్‌తో అతడు వేసే యార్కర్లు, పదునైన బౌన్సర్లు, స్వింగింగ్ డెలివరీస్కు ఎవరి దగ్గరా సమాధానం ఉండట్లేదు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ పేసుగుర్రం అదరగొడున్నాడు. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 9 వికెట్లు తీసి ఇంగ్లీష్ టీమ్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేసుకు చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో మూడు స్థానాలు ఎగబాకిన బుమ్రా.. నంబర్ వన్ ర్యాంక్‌కు చేరాడు. లాంగ్ ఫార్మాట్లో ఓ టీమిండియా పేసర్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోవడంపై బుమ్రా షాకింగ్ పోస్ట్ చేశాడు.
టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న బుమ్రాను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పటివరకు ఏ భారత పేస్ బౌలర్‌కు సాధ్యం కానిది సాధించావ్.. నువ్వు సూపర్ బుమ్రా అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. విమర్శకులు కూడా జస్ప్రీత్ను మించినోడు లేడు.. అతడు ఇలాగే అద్భుతంగా బౌలింగ్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే బుమ్రా మాత్రం ఈ విషయంపై అనూహ్యంగా స్పందించాడు. మద్దతు ఇచ్చేవారు, వెన్ను తట్టి ప్రోత్సహించేవారు ఒక్కరు ఉంటే.. అభినందనలు తెలిపేవారు మాత్రం భారీగా ఉంటారనే అర్థం వచ్చేలా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బుమ్రా. దీంతో అతడు ఎందుకిలా పోస్ట్ చేశాడని ఫ్యాన్స్ ఆలోచనల్లో పడ్డారు. దీనిపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. తాను ఫెయిలైనప్పుడు ఎవరూ సపోర్ట్ చేయలేదని.. ఇప్పుడు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారనే బాధతోనే బుమ్రా ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడని నెటిజన్స్ అంటున్నారు.
ఏ ఆటగాడి కెరీర్లో అయినా ఆటుపోట్లు ఉంటాయి. సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అయితే బాగా రాణించినప్పుడు, గెలిపించినప్పుడు చాలా మంది పొగుడుతారు. కానీ విఫలమైనప్పుడు మాత్రం విమర్శిస్తారు. బుమ్రా పోస్ట్ చేసిన పిక్ దీనికి సంబంధించినదిలాగే అనిపిస్తోంది. ప్లేయర్ మీద నమ్మకం ఉంచి అతడు సక్సెస్ అయినప్పుడే కాదు.. ఫెయిలైనప్పుడు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించాలని, ఆ టైమ్‌లో సపోర్ట్ చేస్తే ఈజీగా బౌన్స్ బ్యాక్ అవుతామనేలా అతడి పోస్ట్ ఉంది. కాగా, టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా (881 పాయింట్లు) తర్వాత రెండో ప్లేసులో కగిసో రబాడ (851) ఉన్నాడు. ఇప్పటిదాకా టాప్ ప్లేస్‌లో ఉన్న అశ్విన్ (841) రెండు ర్యాంకులు కిందకు దిగజారాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (864) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (760) మాత్రమే టాప్-10లో నిలిచాడు. మరి.. బుమ్రా షాకింగ్ పోస్ట్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. ధోని భార్య అని కూడా చూడకుండా..!
Jasprit Bumrah posting some harsh truth about life.
At times we fail as fans but most importantly we fail as humans. This can be a lesson to support our players & people during the bad days more than the good days ❤️ pic.twitter.com/7gUHskP5bw
— All About Cricket (@allaboutcric_) February 8, 2024