SNP
Jasprit Bumrah, Daljit Kaur, T20 World Cup 2024: ప్రస్తుతం బుమ్రాపై అంతా పొగడ్తల వర్షం కురుస్తోంది. కానీ.. అతని బాల్యం ఎంత దారుణంగా గడిచిందో ఎవరికీ తెలియదు. అతని తల్లి కేజీఎఫ్‌లో రాఖీ భాయ్ తల్లిని మించిన యోధురాలు అతని జీవితంలో.. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Jasprit Bumrah, Daljit Kaur, T20 World Cup 2024: ప్రస్తుతం బుమ్రాపై అంతా పొగడ్తల వర్షం కురుస్తోంది. కానీ.. అతని బాల్యం ఎంత దారుణంగా గడిచిందో ఎవరికీ తెలియదు. అతని తల్లి కేజీఎఫ్‌లో రాఖీ భాయ్ తల్లిని మించిన యోధురాలు అతని జీవితంలో.. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. వేలుపట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవ్వరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ.., దల్జిత్ కౌర్ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది. ఆ బిడ్డలో తన భవిష్యత్ చూసుకుంది. అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ మాతృమూర్తి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి. దాంతో పాటు.. క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు నిలబడింది.
వంద కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో.. బంతి అందుకుని మ్యాచ్‌ను మన వైపు తిప్పేశాడు. సూపర్ బౌలింగ్‌తో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. క్రికెట్ అభిమానులంతా ముద్దుగా బూమ్ బూమ్ బుమ్రా అని పిలుచుకునే జస్ప్రీత్ బుమ్రాపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంస వర్షం కురుస్తోంది. ఆహా బుమ్రా, ఓహో బుమ్రా అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు కానీ, పసితనంలో అతను అనాథలా బతికాడని చాలా మందికి తెలియదు. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జస్ప్రీత్ బుమ్రాది పంజాబీ కుంటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్ కౌర్ బుమ్రా. బుమ్రాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. తండ్రిలేని బిడ్డ అయిన మనవడిని, భర్తను కోల్పోయి బాధలో ఉన్న కొడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్ సింగ్ బుమ్రా.. వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు. భర్త మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో.. బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది. అదే ఆమెలో కసి పెంచింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాడ్ని చేయడానికి.. కంకణం కట్టుంది. అప్పటికే వస్త్రపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమె.. తన బిడ్డకోసం మరింత కష్టపడింది.
చిన్నతనం నుంచి బుమ్రాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జిత్ కౌర్.. బుమ్రాను క్రికెట్ వైపు ప్రొత్సహించింది. తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్‌తో ఆడుకుంటూ ఉంటే.. కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్ వస్తే డిస్టబ్ అవుతుందని.. సరిగ్గా గోడ కింద భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు బుమ్రా. అందుకే తాను అంత కచ్చితంగా యార్కర్లు వేయగలుగుతున్నానని ఒకానొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్‌గా ఎదిగాడు. భర్త అండ లేకపోయినా.. అత్తింటివారు పట్టించుకోకపోయినా.. బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్‌గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారుచేసిందని చెప్పాలి.
తన కొడుకు పోయిన తర్వాత.. కోడల్ని, మనవడిని పట్టించుకోకుండా వెళ్లిపోయిన బుమ్రా తాత సంతోక్ సింగ్.. బుమ్రా టీమిండియాకు క్రికెటర్ అయిన తర్వాత.. అంటే 2017లో ఒకసారి బుమ్రాను కలిసేందుకు వస్త్రపూర్‌లోని బుమ్రా ఇంటికి వెళ్లాడు. కానీ, బుమ్రా తల్లి.. ఆయనను కలిసేందుకు నిరాకరించింది. అలాగే బుమ్రా ఫోన్ నంబర్ కూడా ఆయనకు ఇవ్వలేదు. దాంతో.. ఆయన నిరాశగానే బుమ్రా ఇంటి నుంచి వెనుదిరిగి.. శబర్మతి నదిలో శవమైన తేలారు. ఇది 2017లో జరిగింది. ఆయన మృతి కారణాలు ఇంకా తెలియదు. బుమ్రా తాత మరణం గురించి పక్కకపెడితే.. తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా.. బుమ్రా ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. దేశం గర్వించే ఆటగాడు అయ్యాడు. తన సహజమైన బౌలింగ్‌తో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక చివరగా ఈరోజు ఇండియన్ క్రికెట్ కి బుమ్రా అనే ఓ ఆయుధం ఉంది. కానీ.., ఆ ఆయుధాన్ని చెక్కింది మాత్రం కచ్చితంగా దల్జిత్ కౌర్ బుమ్రానే. జిజియా భాయ్ ఓ శివాజీని పెంచినట్టు.. తన కొడుకుని పెంచిన దల్జిత్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం. అమ్మ కష్టం తెలుసుకుని, లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా కూడా యువతకి ఆదర్శం.
woke up a world champion 🇮🇳🏆 pic.twitter.com/4E8meNEvd0
— Jasprit Bumrah (@Jaspritbumrah93) June 30, 2024
Life doesn’t come with a manual, it comes with a mother.🤗 pic.twitter.com/iYB5FpaeHf
— Jasprit Bumrah (@Jaspritbumrah93) February 18, 2022