మ్యాచ్‌కి ముందు ఎక్కువ మాట్లాడిన ఆఫ్ఘాన్‌ ప్లేయర్‌కు బుద్ధి చెప్పిన బుమ్రా!

Jasprit Bumrah, Rahmanullah Gurbaz, IND vs AFG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌కి ముందు గుర్బాజ్‌ చేసిన కామెంట్స్‌కు.. బుమ్రా గ్రౌండ్‌లో అదిరిపోయే బదులిచ్చాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Jasprit Bumrah, Rahmanullah Gurbaz, IND vs AFG, T20 World Cup 2024: ఇండియా వర్సెస్‌ ఆఫ్ఘాన్‌ మ్యాచ్‌కి ముందు గుర్బాజ్‌ చేసిన కామెంట్స్‌కు.. బుమ్రా గ్రౌండ్‌లో అదిరిపోయే బదులిచ్చాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బార్బడోస్‌ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో గెలిచింది రోహిత్‌ సేన. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఆఫ్ఘనిస్థాన్‌ ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. గతంలో పాకిస్థాన్‌ ఆటగాళ్ల నుంచి అలాంటి కామెంట్స్‌ వినిపించేవి. కానీ ఈ సారి ఆ వంతు గుర్బాజ్‌ తీసుకున్నాడు. టీమిండియాతో సూపర్‌ 8 మ్యాచ్‌కి ముందు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతాననని.. ఒక్క బుమ్రానే కాదు, టీమిండియా బౌలర్లను అందరి బౌలింగ్‌ను చితక్కొడతా అంటూ కాస్త అతి వ్యాఖ్యలే చేశాడు.

గుర్బాజ్‌ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా బౌలర్లు ఎవరూ కూడా రెస్పాండ్‌ కాలేదు. ఒక బచ్చా క్రికెటర్‌కు నోటితో ఎందుకు రిప్లై ఇవ్వడం.. మ్యాచ్‌లో చూసుకుందాం అంటూ అంతా సైలెంట్‌గా ఉన్నారు. నిన్న జరిగిన మ్యాచ్‌లో గుర్బాజ్‌కు బుద్ధి చెప్పాడు బుమ్రా. ముందు చెప్పినట్లు.. తొలి ఓవర్‌లో కాస్త అగ్రెసివ్‌గానే ఆడిన గుర్బాజ్‌ను రెండో ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు బుమ్రా. ప్రపంచ క్రికెట్‌లోనే టాప్‌ బౌలర్‌గా ఉన్న బుమ్రాపై ఎటాక్‌ చేస్తానని చెప్పిన గుర్బాజ్‌.. బుమ్రా వేసిన బాల్‌ను ఎలా ఆడాలో కూడా అంచనా వేయలేక.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. టీ20 బౌలర్లపై ఎటాక్‌ చేస్తానన్న గుర్బాజ్‌.. 8 బంతుల్లో 11 పరుగులు చేసి బిస్కెట్‌ అయ్యాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగుల మంచి స్కోర్‌ చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 53, హార్ధిక్‌ పాండ్యా 32, విరాట్‌ కోహ్లీ 24 పరుగులతో రాణించారు. ఆఫ్ఘాన్‌ బౌలర్లలో ఫారూఖీ 3, రషీద్‌ ఖాన్‌ 3 వికెట్లతో రాణించారు. నవీన్‌ ఉల్‌ హక్‌కి ఒక వికెట్‌ దక్కింది. ఇక 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్‌ను భారత్‌ బౌలర్లు 134 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్లు బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ మూడేసి వికెట్లతో చెలరేగడంతో ఆఫ్ఘాన్‌ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అక్షర్‌ పటేల్‌ 1, కుల్దీప్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌కి ముందు గుర్బాజ్‌ చేసిన కామెంట్లు, దానికి గ్రౌండ్‌లో బుమ్రా ఇచ్చిన రిప్లైపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments