SNP
సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా తన స్పెషల్ చూపించాడు. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడను అవుట్ చేస్తూ.. బుమ్రా వేసిన బాల్ మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది. దాని గురించి మరిన్ని వివరాలు చూద్దాం..
సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా తన స్పెషల్ చూపించాడు. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడను అవుట్ చేస్తూ.. బుమ్రా వేసిన బాల్ మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది. దాని గురించి మరిన్ని వివరాలు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత అద్భుతంగా బౌలింగ్ వేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వేగానికి, లైన్ అండ్ లెంత్ ముందు కొన్ని సార్లు ఎంతటి కొమ్ములుతిరిగి బ్యాటర్ అయినా సరే.. తలొంచాల్సిందే. అలాంటి బౌలర్ స్వింగ్‌లో ఉంటే.. హేమాహేమీ బ్యాటర్లే వికెట్ సమర్పించి వెనుదిరగాలి.. అలాంటిది పాపం.. స్టార్ బౌలర్ కగిసో రబాడ మాత్రం ఏం చేస్తాడు. వికెట్ ఇవ్వడమే ఒక్కటే అతని చేతుల్లో ఉంది. అనేక సందర్భాల్లో తన బౌలింగ్‌తో వికెట్లను పడగొట్టి సంతోష పడిన రబాడ.. తొలిసారి తన వికెట్ గాల్లోకి లేచి డాన్స్ చేస్తుంటే చూసి షాక్ అయ్యాడు. వామ్మో వికెట్‌తో ఇలా కూడా డ్యాన్స్ వేయిస్తారా అన్నట్లు ఆశ్చర్యపోతూ.. ఆ వికెట్ డ్యాన్స్‌ను క్రియేట్ చేసిన బుమ్రాను అలానే చూస్తూ.. చిరునవ్వు చిందించాడు. బుమ్రా వేసిన అద్భుతమైన డెలవరీకి క్లీన్ బౌల్డ్ అయిన రబాడ.. తాను బౌల్డ్ అయిన విధానాన్ని తానే నమ్మలేక.. కళ్లతోనే తోటి బౌలర్‌ను అభినందిస్తూ.. పెవిలియన్ బాటపట్టాడు. అయితే.. రబాడ వికెట్ పడిన సమయంలో ఆఫ్ స్టంప్ గాల్లోకి అంతెత్తున లేచి.. పల్టీలు కొట్టింది. ఆ వికెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ బూమ్ బూమ్ స్పెషల్ వికెట్.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 101వ ఓవర్‌లో చోటు చేసుకుంది. అప్పటికే రెండు వికెట్లు పడగొట్టి మంచి జోష్‌లో ఉన్న బుమ్రా.. రబాడకు కళ్లు తిరిగిపోయే బాల్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే రబాడను క్లీన్ బౌల్డ్ చేసి.. టీమిండియాకు 8వ వికెట్ అందించాడు బుమ్రా. రబాడను అవుట్ చేయడంతో తన ఖాతాలో మూడో వికెట్ వేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగడంతో టీమిండియా కేవలం 245 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక్కడే సెంచరీతో సత్తా చాటాడు. 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 101 పరుగులు చేసి.. టీమిండియాకు గౌవర ప్రదమైన స్కోర్‌ను అందించాడు.
నిజానికి టీమిండియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 24 పరుగులకే టీమిండియా తొలి మూడు వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దారుణంగా విఫలం అయ్యారు. మధ్యలో కోహ్లీ-శ్రేయస్ అయ్యర్ జోడి టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేసినా.. లంచ్ తర్వాత ఇద్దరూ అవుట్ కావడంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది. అయితే.. కేఎల్ రాహుల్ మిగిలిన బ్యాటర్ల సపోర్ట్ తీసుకుంటూ.. జట్టుకు కాస్త పర్వాలేదనిపించే స్కోర్ అందించాడు. మరోవైపు సౌతాఫ్రికా మంచి స్కోర్‌తో టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం మూడో రోజు రెండో సెషన్‌లో ఆట కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా 408 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కెప్టెన్ బవుమా గాయంతో బ్యాటింగ్‌కు రాకపోవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 9 వికెట్లకే పూర్తి అయింది. దీంతో ప్రొటీస్ జట్టుకు 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేయకుంటే.. ఓటమి కూడా తప్పకపోచ్చు. మరి ఈ మ్యాచ్‌లో రబాడను బుమ్రా అవుట్ చేసిన విధానం, వికెట్ గాల్లో డ్యాన్స్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Too good for KG – too good for anyone 🍑
Tune in to the 1st #SAvIND Test LIVE on @StarSportsIndia pic.twitter.com/uqHWjedgMx
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023