iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: నిప్పులు చెరిగిన బుమ్రా.. జహీర్ రికార్డు బ్రేక్! ఇక మిగిలింది ఆ ఒక్కడే

  • Published Jan 04, 2024 | 3:47 PM Updated Updated Jan 04, 2024 | 5:01 PM

నిప్పులు చెరిగే బంతులతో ప్రోటీస్ బ్యాటర్ల భరతం పట్టాడు బూమ్ బూమ్ బుమ్రా. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ రికార్డును బ్రేక్ చేశాడు.

నిప్పులు చెరిగే బంతులతో ప్రోటీస్ బ్యాటర్ల భరతం పట్టాడు బూమ్ బూమ్ బుమ్రా. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ రికార్డును బ్రేక్ చేశాడు.

Jasprit Bumrah: నిప్పులు చెరిగిన బుమ్రా.. జహీర్ రికార్డు బ్రేక్! ఇక మిగిలింది ఆ ఒక్కడే

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన చేసి.. 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు బుమ్రా వంతు వచ్చింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టును తన పేస్ బౌలింగ్ తో వణికించాడు. తొలుత ముకేశ్ కుమార్ టీమిండియాకు బ్రేక్ త్రూ అందించగా.. ఆ తర్వాత నిప్పులు చెరిగే బంతులతో ప్రోటీస్ బ్యాటర్ల భరతం పట్టాడు బూమ్ బూమ్ బుమ్రా. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక బుమ్రా ముందు మిగిలింది ఆ ఒక్క దిగ్గజ ఆటగాడి రికార్డే.

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నుముకగా నిలుస్తూ వస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో భారత జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో దుమ్మురేపాడు బుమ్రా. తన పేస్ బౌలింగ్ తో సఫారీ జట్టు నడ్డి విరిచాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రోటీస్ జట్టుకు తొలి షాక్ ఇచ్చాడు ముకేశ్ కుమార్. ఆ తర్వాత మిగతా బ్యాటర్ల పనిపట్టాడు బుమ్రా. తన పదునైన పేస్ బౌలింగ్ తో ట్రిస్టన్ స్టబ్స్(1), డేవిడ్ బెడింగ్ హమ్(11), కైల్ వెరెన్నే(9), మార్కో జాన్సన్(11), కేశవ్ మహారాజ్(3) ల వికెట్లను పడగొట్టి.. సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే 5 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

SENA(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో టీమిండియా బౌలర్ గా నిలిచాడు బుమ్రా. ఈ దేశాలపై 6 సార్లు ఐదు వికెట్లు తీశాడు బుమ్రా. ఇదివరకు జహీర్ ఖాన్ 6 సార్లు 5 వికెట్లు తీశాడు. ఇక ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్. అతడు 7 సార్లు 5 వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55, రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 78 పరుగుల స్వల్ప లక్ష్యం భారత్ ముందు ఉంచింది. బుమ్రా ఈ మ్యాచ్ లో ఒవరాల్ గా 8 వికెట్లు పడగొట్టాడు. మరి బుమ్రా ఈ అరుదైన రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.