కరీబియన్ దీవుల పర్యటనను భారత జట్టు పేలవంగా ముగించింది. వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో పరాభవంతో సిరీస్‌ను విండీస్ టీమ్‌కు అప్పగించింది. జట్టులో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లకు కొదవ లేకున్నా భారత్ సిరీస్ ఓడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌తో పాటు వన్డే ప్రపంచ కప్‌కు క్వాలిఫై కాలేకపోయిన వెస్టిండీస్ చేతిలో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాభవానికి టీమ్ మేనేజ్మెంట్, ప్లేయర్ల ఫెయిల్యూర్‌తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. కాగా, విండీస్ టూర్ ముగియడంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఐర్లాండ్‌కు చేరుకుంది.
ఐర్లాండ్‌లో ఆగస్టు 18, 20, 23 తేదీల్లో జరిగే ఈ సిరీస్ కోసం టీమిండియా ప్లేయర్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. చిన్న టీమే కదా అని తేలిగ్గా తీసుకోకుండా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్‌కు సారథ్యం వహించనున్న పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తగ్గేదేలే అనేలా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. అతడికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బుమ్రా పదునైన బంతులు వేస్తూ కనిపించాడు. బీసీసీఐ షేర్ చేసిన వీడియోను చూస్తుంటే.. రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా మునుపటి వేగాన్ని, లయను అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా బ్యాట్స్‌మెన్‌కు నిప్పులు చెరిగే బంతులను సంధించాడతడు. పేసు గుర్రం బౌలింగ్‌ను ఎదుర్కోలేక బ్యాటర్లు వణికిపోయారు. బుమ్రా పేస్‌కు వారి దగ్గర జవాబే లేకుండా పోయింది.
దాదాపుగా ఒక సంవత్సర కాలంగా బంతి పట్టని బుమ్రా తిరిగి రిథమ్‌ను అందుకోవడంతో బీసీసీఐ సంతోషం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. బుమ్రా బౌలింగ్ వీడియోతో పాటు రిషబ్ పంత్ బ్యాటింగ్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్‌కు దూరమైన పంత్.. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ల ప్రాక్టీస్ వీడియోలు కూడా కొన్ని రోజుల కింద ఇలాగే వైరల్ అయ్యాయి. వీళ్లందరూ వన్డే వరల్డ్ కప్ నాటికి తిరిగి టీమిండియాలో చేరితే మన జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఫ్యాన్స్ అంటున్నారు.
The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9
— BCCI (@BCCI) August 16, 2023
Rishabh Pant’s batting practice, recovery has been excellent.
– Great news for Indian cricket. pic.twitter.com/KThpdkagDz
— Johns. (@CricCrazyJohns) August 16, 2023
🚨 KL Rahul & Shreyas Iyer in the midst of a match simulation exercise at the KSCA ‘B’ grounds.
🎥: Rishabh Pant/Instagram#KLRahul #ShreyasIyer #AsiaCup2023 pic.twitter.com/rDZVfWMpVj
— Deepanshu Thakur (@realdpthakur17) August 14, 2023