iDreamPost
android-app
ios-app

బాబర్ ని వణికించిన బుమ్రా! బాల్ టచ్ కూడా చేయలేదు!

  • Author Soma Sekhar Updated - 09:36 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Updated - 09:36 PM, Mon - 11 September 23
బాబర్ ని వణికించిన బుమ్రా! బాల్ టచ్ కూడా చేయలేదు!

అతడు నంబర్ వన్ బ్యాటర్.. కానీ టీమిండియా బౌలర్ ముందు మాత్రం జుజుబీ. ఆ నంబర్ వన్ బ్యాటర్ ఎవరో కాదు.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్. ఇక ఈ స్టార్ బ్యాటర్ ను వణికించిన బౌలర్ ఎవరో కాదు.. టీమిండియా స్పీడ్ స్టర్ బుమ్రా. ఆసియా కప్ లో భాగంగా గ్రూప్ 4 లో ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్, గిల్ అర్ధసెంచరీలతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీస్ తో కదంతొక్కారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా పాక్ కెప్టెన్ కు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించాడు.

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు. తన పదునైన స్వింగ్ తో, పేస్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగల సమర్థుడు బుమ్రా. తాజాగా ఆసియా కప్ 2023లో భాగంగా గ్రూప్ 4 మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ కు చుక్కలు చూపించాడు బుమ్రా. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ.. కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా స్పీడ్ స్టర్ బుమ్రా అద్భుతమైన పేస్ ఎటాక్ తో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ లోనే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(9)ను తన స్వింగ్ తో బోల్తా కొట్టించాడు.

అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ కు ఈ మ్యాచ్ ఓ పీడకల అనే చెప్పాలి. బుమ్రా వేసిన 5వ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన బాబర్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్ గా చెలామని అవుతున్న బాబర్.. బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేకపోయాడు. బూమ్రా బౌలింగ్ లో అతడు ఎదుర్కొన్న 10 బంతులు డాట్ బాల్స్ కావడం గమనార్హం. బుమ్రా బాబర్ కు రెండు ఓవర్లు వేయగా.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు బాబర్. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు బుమ్రా బౌలింగ్ కు బాబర్ ఎంతగా భయపడ్డాడో. అతడు బంతు వేస్తుంటే.. చూస్తూ ఉండటమే బాబర్ పనిగా మారింది.

ఇక బుమ్రా దెబ్బకి ఆత్మ విశ్వాసం కోల్పోయిన బాబర్ నెక్ట్స్ ఓవర్ లోనే హార్దిక్ పాండ్యాకు వికెట్ సమర్పించుకున్నాడు. పాండ్యా అద్భుతమైన ఇన్ స్వింగ్ తో బాబర్ ను బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో.. ఆటను నిలిపివేశారు. 11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది పాక్. క్రీజ్ మహ్మద్ రిజ్వాన్(1), ఫఖర్ జమాన్(14) పరుగులతో ఉన్నారు. మరి బాబర్ ను వణికించిన బుమ్రా బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.