Jasprit Bumrah: వరల్డ్‌ నెం.1గా బుమ్రా! క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు!

టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా రేర్ ఫీట్ సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సాధించాడు. మరి ఆ రికార్డు ఏంటో చూద్దాం.

టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా రేర్ ఫీట్ సాధించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సాధించాడు. మరి ఆ రికార్డు ఏంటో చూద్దాం.

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో 881 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. దీంతో ఓ రేర్ ఫీట్ ను సాధించి.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా నిలిచాడు. మరి ఆ ఘనత ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం పదండి.

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన యార్కర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించడంలో సిద్దహస్తుడు బుమ్రా. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో 9 వికెట్లు తీయడం ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ స్పీడ్ స్టర్. ఈ క్రమంలోనే టెస్ట్ కెరీర్ లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఆ జాబితాలో అగ్రస్థానం సంపాదించుకున్నాడు బుమ్రా. దీంతో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అదేంటంటే?

టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ లో నెం.1 బౌలర్ అయిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు బుమ్రా. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా మూడు ఫార్మాట్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించలేదు. ప్రస్తుతం బుమ్రా టెస్టుల్లో నెం. 1 బౌలర్ గా ఉండగా.. గతంలో వన్డేల్లో, టీ20ల్లో అగ్రస్థానం ఆక్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తన కెరీర్ లో 34 టెస్టులు ఆడిన బుమ్రా 64 ఇన్నింగ్స్ ల్లో 152 వికెట్లను పడగొట్టాడు. మరి ఈ అరుదైన ఫీట్ ను సాధించిన బుమ్రాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: అండర్-19లో జూనియర్ కోహ్లీ..! బౌలర్ ఓవర్‌ యాక్షన్‌కి ధీటైన జవాబు!

Show comments