iDreamPost

అండర్-19లో జూనియర్ కోహ్లీ..! బౌలర్ ఓవర్‌ యాక్షన్‌కి ధీటైన జవాబు!

  • Published Feb 07, 2024 | 1:29 PMUpdated Feb 07, 2024 | 1:29 PM

ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం సహజం. కానీ, కొన్ని సార్లు అది హద్దు మీరి.. పిచ్చి ప్రవర్తనకు దారితీస్తోంది. అలాంటి వింత ప్రవర్తనతో సౌతాఫ్రికా స్టార్‌ బౌలర్‌ లైన్‌ దాటాడు. అతనికి భారత కుర్రాడు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం సహజం. కానీ, కొన్ని సార్లు అది హద్దు మీరి.. పిచ్చి ప్రవర్తనకు దారితీస్తోంది. అలాంటి వింత ప్రవర్తనతో సౌతాఫ్రికా స్టార్‌ బౌలర్‌ లైన్‌ దాటాడు. అతనికి భారత కుర్రాడు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 07, 2024 | 1:29 PMUpdated Feb 07, 2024 | 1:29 PM
అండర్-19లో జూనియర్ కోహ్లీ..! బౌలర్ ఓవర్‌ యాక్షన్‌కి ధీటైన జవాబు!

క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య మాటామాట అనుకోవడం కామనే. తన బౌలింగ్‌లో బ్యాటర్‌ మంచి షాట్‌ ఆడితే.. ఏ బౌలర్‌కి నచ్చదు. అలాగే బౌన్సర్లతో ఇబ్బంది పెడుతున్న బౌలర్‌ అంటే కూడా బ్యాటర్‌కు నచ్చదు. అలాంటి టైమ్‌లో ఎదుటివారి లయను, ఏకాగ్రతను దెబ్బతీయాడానికి ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఆ టైమ్‌లో వారి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం.. సౌతాఫ్రికా బౌలర్‌ ఏకంగా బూతులు, అసభ్యకరమైన సైగలతో విరుచుకుపడ్డాడు. వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ కదా ఆ మాత్రం హీట్‌ ఉంటుందని అనుకోవచ్చు.. కానీ, భారత కుర్రాడు అర్షిన్‌ కులకర్ణి చూపించిన హుందా తనం ఈ ఘటనలో హైలెట్‌గా నిలిచింది. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

అండర్‌ 19 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా.. మంగళవారం సౌతాఫ్రికా-ఇండియా మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ కులకర్ణి బ్యాటింగ్‌ చేస్తుండగా.. సౌతాఫ్రికా బౌలర్‌ క్వేనా మఫాకా ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. అప్పటికే టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. మరింత కష్టాల్లోకి నెట్టేందుకు ఇదే అదునుగా భావించిన మఫాకా.. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన కులకర్ణిని బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాడు. తొలి మూడు బంతులకు కులకర్ణి పరుగులేమీ చేయలేకపోయాడు. అయినా కూడా మఫాకా షార్ట్‌ బాల్స్‌తో అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. కానీ, నాలుగో బాల్‌కు కులకర్ణి అద్భుతమైన షాట్‌ బాల్‌ ఆడి.. భారీ సిక్స్‌ కొట్టాడు. బాల్‌తో పని జరగట్లేదని.. మఫాకా తన నోటికి పనిచెప్పాడు. కులకర్ణిని ఏవో బూతులు తిడుతూ.. చేత్తో అసభ్యకర సైగలు చేశాడు. తర్వాత రెండు బంతులను డాట్స్‌గా వేసి.. మళ్లీ అలాగే ప్రవర్తించాడు.

ఒక వైపు మఫాకా పిచ్చి ప్రవర్తనతో రెచ్చిపోతుంటే.. మరోవైపు కులకర్ణి మాత్రం ఎంతో హుందాగా చిరునవ్వుతో బదులిస్తూ కనిపించాడు. మఫాకా కావాలనే తనను రెచ్చగొడుతున్నాడని గ్రహించిన కులకర్ణి అతన్ని పట్టించుకోలేదు. కాగా, మఫాకా ప్రవర్తనకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పెద్దగా కష్టసాధ్యంకానీ ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో తడబడింది. కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌, సచిన్‌ దాస్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో టీమిండియాను గెలిపించి.. ఫైనల్‌ చేర్చారు. 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి భారత్‌ టార్గెట్‌ ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో మఫాకా-కులకర్ణి మధ్య జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి