SNP
Jasprit Bumrah, Smriti Mandhana, ICC Award: భారత క్రికెట్‌లో ఆణిముత్యాలంటి బుమ్రా, స్మృతి మంధాన తాజాగా మన దేశానికి మరో ఘనత అందించాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Jasprit Bumrah, Smriti Mandhana, ICC Award: భారత క్రికెట్‌లో ఆణిముత్యాలంటి బుమ్రా, స్మృతి మంధాన తాజాగా మన దేశానికి మరో ఘనత అందించాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ అరుదైన రికార్డు నమోదైంది. అది కూడా భారత్‌కు చెందిన క్రికెటర్లు సాధించడం విశేషం. తాజాగా బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ప్రకటించింది. జూన్ నెలకు గాను ప్రకటించిన ఈ అవార్డుల విషయంలో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో పురుషుల క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్ క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికయ్యారు.
జూన్ నెలకు గాను.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇటు మెన్స్ క్రికెట్‌లో, అటు ఉమెన్స్ క్రికెట్‌లో రెండు విభాగాల్లోనూ భారత ప్లేయర్లకే లభించడం విశేషం. ఇది విశేషమే కాకుండా ఒక అరుదైన రికార్డు కూడా. అది ఎలా అంటే.. ఐసీసీ ఈ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు ప్రకటించడం ప్రారంభించిన నాటి నుంచి.. ఒకే దేశానికి చెందిన మెన్ క్రికెటర్, ఉమెన్ క్రికెటర్.. ఈ అవార్డును ఒకేసారి అందుకోవడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను తొలిసారి జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన తమ అద్భుతమైన ప్రదర్శనతో సాధించారు.
తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విషయం తెలిసిందే. తన అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా విజయాలతో పాటు టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో బుమ్రా 15 వికెట్లు పడగొట్టాడు. పైగా బుమ్రా ఎకానమీ 4.17 మాత్రమే. పైగా ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన దశలో.. చివరి ఐదు ఓవర్లలో రెండు ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి.. మ్యాచ్‌ను ఇండియా వైపు తిప్పేశాడు. ఇక ఉమెన్స్ క్రికెట్‌లో స్మృతి మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది.
మన దేశంలో పర్యటించేందుకు వచ్చిన సౌతాఫ్రికా బౌలర్లను చీల్చిచెండాడుతూ.. సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో 117, 136, 90 పరుగులతో మూడు మ్యాచ్‌ల్లో ఏకంగా 343 పరుగులు చేసింది. అలాగే టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగుల ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. జూన్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు చూపించిన అద్భుత ప్రదర్శనకు గాను.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులతో గౌరవించింది. మరి ఒకే సారి ఈ అవార్డు అందుకుని భారత్‌కు మరో ఘనత అందించిన బుమ్రా, మంధానపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah and Smriti Mandhana were recognized with the 𝗜𝗖𝗖 𝗣𝗹𝗮𝘆𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗼𝗻𝘁𝗵 award (JUNE) for their exceptional performances. pic.twitter.com/dedtFStiDq
— CricTracker (@Cricketracker) July 9, 2024