SNP
SNP
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య హోరాహోరీగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది. చాలా సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ సీనియర్ స్టార్ జెమ్స్ అండర్సన్ అదిరిపోయే ఫీట్ చేశాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో జిమ్మీ క్రికెట్ బాల్‌తో ఫుట్‌బాల్ ఆడాడు. బాల్‌ను కాలితో కొడుతూ అందుకున్నాడు. అది కూడా మూడు నాలుగుసార్లు సేమ్ ఫుట్‌బాల్‌ను లేపినట్లే గాల్లోకి లేపడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
చాలా గట్టిగా ఉండే క్రికెట్ బాల్‌ను జిమ్మీ ఇంత ఈజీగా గాల్లోకి కాలితో లేపడంతో అతనికి ఫుట్‌బాల్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రికెట్ బాల్ గురించి తెలిసిన ఎవరు కూడా దాన్ని అంత ఈజీగా ఫుల్‌బాల్‌లా కాలిపై ఆడించలేరని అంటున్నారు. కానీ, జిమ్మీ మాత్రం చాలా సింపుల్‌గా అలా చేయడం విశేషం. కిందున్న వీడియోలో జిమ్మీ ఫుట్‌బాల్ స్కిల్స్‌ను మీరూ చేసేయండి.
ఇక హోరాహోరీగా జరుగుతున్న నాలుగో టెస్టు విషయానికి వస్తే.. ఇంగ్లండ్ విజయం వైపు దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కనీసం డ్రా చేసుకున్నా అది అద్భుతమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌పై అంతలా పట్టుబిగించి ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌట్ అయింది. లబుషేన్, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో చెలరేగాడు. స్టువర్ట్ బ్రాడ్ 2, అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 592 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే 189 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి.. ఇంగ్లండ్‌కు భారీ స్కోర్ అందించాడు. మొయిన్ అలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 రాణించడంతో ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. ఇక చివర్లో జానీ బెయిర్‌స్టో వేగంగా పరుగులు చేసి ఆసీస్‌ను భయపెట్టాడు. కానీ, దురదృష్టవశాత్తు అతను 99 పరుగులతో నాటౌట్‌గా ఉన్న సమయంలోనే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 81 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులతో 99 పరుగులు చేసిన బెయిర్‌స్టో సెంచరీ పూర్తి చేసుకోలేక నాటౌట్‌గా మిగిలిపోయాడు.
తొలి ఇన్నింగ్స్ తర్వాత మంచి లీడ్ సాధించిన ఇంగ్లండ్. అదే జోరును ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌలింగ్‌లోనూ చూపిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. లుబుషేన్ 44, మిచెల్ మార్ష్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. మరో రెండు రోజులు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనతో పాటు జెమ్స్ అండర్సన్ ఫుట్‌బాల్ స్కిల్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Football skills on display from Jimmy Anderson. pic.twitter.com/AuAP6xiZth
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2023
ఇదీ చదవండి: సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లీ! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..