Nidhan
James Anderson: ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 21 ఏళ్ల పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన జిమ్మీ ఇక మీదట క్రికెట్ ఫీల్డ్‌లో కనిపించడు.
James Anderson: ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 21 ఏళ్ల పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన జిమ్మీ ఇక మీదట క్రికెట్ ఫీల్డ్‌లో కనిపించడు.
Nidhan
క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ జెంటిల్మన్ గేమ్‌కు గుడ్ బై చెప్పేశాడు. 21 ఏళ్ల పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో అభిమానుల్ని ఉర్రూతలూగించిన జిమ్మీ ఇక మీదట క్రికెట్ ఫీల్డ్‌లో కనిపించడు. ఈతరం చూసిన బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్‌లో అండర్సన్ టాప్‌లో ఉంటాడు. అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించిన అతడు.. టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 188 టెస్టుల్లో 704 వికెట్లు తీసి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌గా నిలిచాడు. ఒక పేస్ బౌలర్ అన్ని వికెట్లు తీస్తాడని ఎవరూ ఊహించలేదు. గాయాలతో సావాసం చేసే సీమర్స్ రెండు దశాబ్దాలకు పైగా కంటిన్యూ అవడం అంటే అదో మ్యాజిక్ అనే చెప్పాలి. ఓవరాల్ కెరీర్లో 40 వేల బంతులు వేయడం మరో హైలైట్.
147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలో ఒక బౌలర్ 40 వేల బంతుల మార్క్‌ను అందుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. వెస్టిండీస్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్‌తో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన జిమ్మీ.. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. పోతూ పోతూ ఓ సూపర్ డెలివరీ వేశాడు. అద్భుతమైన ఇన్‌స్వింగర్ వేసి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అండర్సన్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఇంగ్లండ్ ఫ్యాన్స్ భారీగా లార్డ్స్‌కు తరలివచ్చారు. ఆఖరుగా డ్రెస్సింగ్ రూమ్‌లో షాంపేన్ తాగి వాళ్లకు చీర్స్ చెప్పాడు అండర్సన్. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతో మందితో కలసి ఆడిన ఈ ఇంగ్లీష్ సీమర్.. టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ అంటే మాత్రం తనకు భయమని అంటున్నాడు. అతడ్ని ఎక్కువ సార్లు ఔట్ చేయలేకపోయాననే బాధ తనను వెంటాడుతోందని చెప్పాడు.
‘ఏ ప్లేయర్ కెరీర్లో అయినా ఎత్తుపళ్లాలు ఉంటాయి. కొన్ని సిరీస్‌ల్లో బాగా ఆడాననే ఫీలింగ్ ఉంటుంది. ఇంకొన్ని సిరీస్‌ల్లో బ్యాటర్లు నా బౌలింగ్‌లో ఈజీగా రన్స్ చేశారని అనిపిస్తుంది. విరాట్ కోహ్లీని కెరీర్ స్టార్టింగ్ టైమ్‌లో చాలామార్లు అలవోకగా ఔట్ చేశా. ప్రతి బాల్‌కు అతడ్ని ఔట్ చేస్తానని అనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితి మారిపోయింది. విరాట్‌ను ఔట్ చేయడం అసాధ్యంగా మారింది. అది నన్ను న్యూనతకు గురిచేసింది. అతడ్ని ఎక్కువ సార్లు ఔట్ చేయలేకపోయాననే బాధ ఉంది’ అని అండర్సన్ చెప్పుకొచ్చాడు. తాను బౌలింగ్ చేసిన వారిలో బెస్ట్ బ్యాటర్‌గా మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు జిమ్మీ. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారి అతడికి చెత్త బాల్ వేయొద్దని ఆలోచనతోనే ఆడేవాడ్నని గుర్తుచేసుకున్నాడు. ఎంత బాగా వేసినా సచిన్ పరుగులు రాబట్టేవాడంటూ మెచ్చుకున్నాడు. మరి.. కోహ్లీ-సచిన్ మీద అండర్సన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Jimmy Anderson said, “playing against Virat Kohli in the early days, you feel you could get him out every ball. But now, you feel you can’t get him out at all and feel so inferior”. (Sky Sports). pic.twitter.com/Bg8KthBoWi
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024