iDreamPost
android-app
ios-app

వీడియో: ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌

  • Published Jul 12, 2024 | 4:18 PM Updated Updated Jul 12, 2024 | 4:18 PM

James Anderson, Guard of Honour, ENG vs WI: 21 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో క్రికెట్‌కే వన్నెతెచ్చిన జెమ్స్‌ అండర్సన్‌కు అరుదైన గౌరవం దక్కింది. దాని గురించి మరిన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

James Anderson, Guard of Honour, ENG vs WI: 21 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో క్రికెట్‌కే వన్నెతెచ్చిన జెమ్స్‌ అండర్సన్‌కు అరుదైన గౌరవం దక్కింది. దాని గురించి మరిన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 12, 2024 | 4:18 PMUpdated Jul 12, 2024 | 4:18 PM
వీడియో: ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌

ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ క్రికెటర్లు. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చివరి సారిగా గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న అండర్సన్‌కు రెండు దేశాల క్రికెటర్లు ఈ విధంగా గౌరవించారు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌.. అండర్సన్‌ కెరీర్‌లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ కానుంది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఈ టెస్ట్‌ మూడో రోజే ముగిసే సూచనలు కనిపిస్తుండటంతో గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు.

కాగా.. అండర్సన్‌ ప్రపంచంలోనే అత్యత్తుమ బౌలర్లలో ఒకడిగా కీర్తి గడించాడు. దాదాపు 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అలుపెరగని పోరాట యోధుడిలా తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సూపర్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ జట్టుకు ఒక స్ట్రాంగ్‌ పిల్లర్‌లా నిలిచాడు అండర్సన్‌. ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించాడు. సుదీర్ఘ కెరీర్‌ను ఎంతో అద్భుతంగా కొనసాగించిన అతను నేటితో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాడు.

అండర్సన్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. తన కెరీర్‌లో 188 టెస్టుల్లో 704 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌లో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 10.4 ఓవర్లు వేసిన అండర్సన్‌ 2.40 ఎకానమీతో 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. అలాగే విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి 1.10 ఎకానమీతో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఒక్క గొప్ప బౌలర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మిస్‌ అవ్వడం ఖాయం. మరి అండర్సన్‌ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.