iDreamPost
android-app
ios-app

వీడియో: ENG vs WI లార్డ్స్‌ టెస్ట్‌ను గంట కొట్టి ప్రారంభిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా?

  • Published Jul 10, 2024 | 5:33 PMUpdated Jul 10, 2024 | 5:33 PM

James Anderson, Lord's Test, ENG vs WI, Lola Rose: ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ టెస్ట్‌ను ఇద్దరమ్మాయిలు గంట మోగించి ప్రారంభించారు. మరి ఆ అమ్మాయిలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఈ రోజు ప్రారంభం అయింది. అయితే.. ఈ మ్యాచ్‌ను ఇద్దరు అమ్మాయిలు గంట మోగించి ప్రారంభించారు. లార్డ్స్‌లో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌లను స్టేడియంలో ఉండే పెద్ద గంటను మోగించి ప్రారంభించడం ఆనవాయితీ. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు మోగించిన అమ్మాయి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె గంట మోగించిన వీడియోను క్రికెట్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు.. ఈ అమ్మాయి ఎవరంటూ సెర్చ్‌ చేస్తున్నారు. మరి ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం..

తాజాగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య ప్రారంభమైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్‌గా ఖ్యాతి పొందిన ఇంగ్లండ్‌ సీనియర్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌. అతని చివరి మ్యాచ్‌ను మరింత మధురంగా మార్చేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు లార్డ్స్‌ ప్రతిష్టాత్మకమైన గంట మోగించే అవకాశం అండర్సన్‌ కుటుంబ సభ్యులకు కల్పించారు.

అండర్సన్‌ చివరి టెస్టు మ్యాచ్‌ను అతని కుటుంబ సభ్యులు గంట మోగించి ప్రారంభించారు. అండర్సన్‌ ఇద్దరు కూతుళ్లు గంట మోగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దమ్మాయి లోలా రోస్‌(నల్ల జుట్టు), చిన్న కూతురు రూబీ లక్స్ లార్డ్స్‌ టెస్ట్‌ ప్రారంభిస్తూ బెల్‌ కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోస్‌ 2009లో, రూబీ 2010లో జన్మించారు. మరి అండర్సన్‌ చివరి టెస్టులో ఈ ప్రత్యేక ఏర్పాటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి