SNP
James Anderson, England, ENG vs WI: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అద్భుతమైన రికార్డు నమోదైంది. ఓ బౌలర్ 40 వేల బంతులు వేసి.. ఏకంగా 800 కిలో మీటర్లు పరిగెత్తాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. మరి ఆ రికార్డు అందుకున్న క్రికెట్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
James Anderson, England, ENG vs WI: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అద్భుతమైన రికార్డు నమోదైంది. ఓ బౌలర్ 40 వేల బంతులు వేసి.. ఏకంగా 800 కిలో మీటర్లు పరిగెత్తాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. మరి ఆ రికార్డు అందుకున్న క్రికెట్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
సాధారణంగా మనం కొంత దూరం పరిగెత్తితేనే అలసిపోతాం.. రోజు పరిగెత్తే అలవాటు ఉన్న వాళ్లు, శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్లు కాస్త ఎక్కువ దూరం పరిగెత్తగలరు. కానీ, జీవిత కాలంలో మొత్తం కలిపి ఓ వంద కిలో మీటర్ల దూరం పరిగెత్తి ఉంటాం. అయితే.. ఓ క్రికెటర్ మాత్రం 21 ఏళ్ల కాలంలోనే ఏకంగా 800 కిలో మీటర్ల దూరం పరిగెత్తాడు. అయితే.. అది ఒక్కసారిగా కాదులేండి. తన కెరీర్‌లో కేవలం బౌలింగ్ కోసం తీసుకున్న రన్నప్ ఉంటుంది కదా.. ఆ రన్నప్‌లో అతను పరిగెత్తిన దూరం మొత్తం కలిపితే.. ఆ కెరీర్‌లో చివరి మ్యాచ్ సమయానికి 800 కిలో మీటర్ల పైనే వచ్చింది. ఇన్ని వందల కిలో మీటర్లను కేవలం రన్నప్‌లోనే పరిగెత్తాడంటే అతను చాలా కాలం క్రికెట్ ఆడి ఉండాలి. చాలా కాలం కాదు.. ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న దిగ్గజ క్రికెటర్ జెమ్స్ అండర్సన్ ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
2003లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అండర్సన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే టెస్టు క్రికెట్‌లో ఏకంగా 40 వేల బంతులు వేశాడు. 40 వేల బంతులు విసిరితే.. మెషీన్ కూడా చెడిపోతుంది. కానీ, అండర్సన్ మాత్రం ఇంకా అలసిపోలేదు. తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న అతను ఇంకా అద్భుతమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తున్నాడు. ఇన్ స్వింగ్ డెలవరీతో కెరీర్ పీక్‌లో ఉన్నట్లు బౌలింగ్ చేస్తున్నాడు. టెస్టు క్రికెట్‌లో 188వ టెస్ట్ ఆడుతున్న అండర్సన్ ఇప్పటి వరకు టెస్టుల్లో 40 వేల బంతులు వేశాడు. 147 ఏళ్ల చరిత్ర కలిగిన క్రికెట్‌లో ఓ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్ని వేల బంతులు వేయలేదు. 40 వేల మార్క్ అందుకున్న తొలి బౌలర్‌గా అండర్సన్ చరిత్రలో నిలిచిపోయాడు. అతను రన్నప్‌లో పరిగెత్తిన మొత్తం దూరం కలిపితే.. ఏకంగా 800 కిలో మీటర్లుగా లెక్కతేలింది. సాధారణంగా బౌలింగ్ వేసేందుకు అండర్సన్ 18 నుంచి 20 మీటర్ల లెంత్ తీసుకుంటాడు. అలా అతని అన్ని టెస్టుల్లో పరిగెత్తిన దూరం 800 కిలో మీటర్ల కంటే పైనే తేలింది.
ఇది కేవలం టెస్టుల లెక్క మాత్రమే ఇంకా వన్డేలు, టీ20లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వెస్టిండీస్‌తో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్టుతో అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. చివరి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 10.4 ఓవర్లు వేసిన అండర్సన్ 2.40 ఎకానమీతో 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి 1.10 ఎకానమీతో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మరో నాలుగు వికెట్లు కోల్పోతే విండీస్ రెండో ఇన్నింగ్స్ ముగియనుంది. మరి ఆ 4 వికెట్లలో అండర్సన్ ఎన్ని వికెట్లు తీసుకుంటాడో చూడాలి. తన కెరీర్‌లో 188 టెస్టుల్లో 703 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. మరి ఇంత అద్భుతమైన కెరీర్‌ను కొనసాగించిన అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
JIMMY ANDERSON COMPLETES 40,000 DELIVERIES IN TEST CRICKET. 🤯
– He ran approximately 800km in his run up only! 🥶 pic.twitter.com/wbs2s7BgbX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024
21 years of doing the same thing 🐐 pic.twitter.com/SP6T68jol3
— Misran Ahmad 🏏Shahzadain 🇵🇰 (@MisranAhmad19) July 11, 2024