iDreamPost
android-app
ios-app

Jake Fraser-McGurk: ఆ టీమిండియా ప్లేయరే నా ఇన్స్పిరేషన్.. రూమ్ నిండా అతని ఫొటోలే: జేక్ ఫ్రేజర్

  • Published Apr 27, 2024 | 10:13 PM Updated Updated Apr 27, 2024 | 10:13 PM

తాను క్రికెట్ లోకి రావడానికి ఆ టీమిండియా దిగ్గజ ప్లేయరే కారణమని, అతడి ఫొటోలే తన రూమ్ నిండా ఉన్నాయని పేర్కొన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన ప్లేయర్ జేక్ ఫ్రేజర్. మరి ఫ్రేజర్ కు స్ఫూర్తినిచ్చిన ఆ భారత ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

తాను క్రికెట్ లోకి రావడానికి ఆ టీమిండియా దిగ్గజ ప్లేయరే కారణమని, అతడి ఫొటోలే తన రూమ్ నిండా ఉన్నాయని పేర్కొన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన ప్లేయర్ జేక్ ఫ్రేజర్. మరి ఫ్రేజర్ కు స్ఫూర్తినిచ్చిన ఆ భారత ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

Jake Fraser-McGurk: ఆ టీమిండియా ప్లేయరే నా ఇన్స్పిరేషన్.. రూమ్ నిండా అతని ఫొటోలే: జేక్ ఫ్రేజర్

జేక్ ఫ్రేజర్.. ప్రస్తుతం ఐపీఎల్ లో మారుమోగుతున్న పేరు. 22 ఏళ్ల ఈ కుర్రాడికి వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం భయపడుతున్నారంటే అతిశయోక్తికాదు. అంతలా తన ఆటతీరుతో బెంబేలెత్తిస్తున్నాడు ఈ ఢిల్లీ ప్లేయర్. జట్టులోకి కాస్త లేట్ గా వచ్చినా.. ఆ లోటును భర్తీ చేశాడు ఫ్రేజర్. టీమ్ లోకి రాకముందు నుంచే ఈ ఆసీస్ సంచలనంపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే చలరేగిపోతున్నాడు ఈ చిచ్చరపిడుగు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో 27 బంతుల్లో 84 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడి.. టీమ్ కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు ఫ్రేజర్. తాను క్రికెట్ లోకి రావడానికి ఆ టీమిండియా దిగ్గజ ప్లేయరే కారణమని, అతడి ఫొటోలే తన రూమ్ నిండా ఉన్నాయని పేర్కొన్నాడు. మరి ఆ భారత ప్లేయర్ ఎవరు?

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ ప్లేస్ లో ఉంది. అయితే ఢిల్లీ విజయాల వెనక ఓ శక్తి ఉంది. ఆ శక్తి పేరే జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ 22 ఏళ్ల నయా సంచలనం.. నిజంగానే ఐపీఎల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో 3 అర్దశతకాలతో కలిపి 245 పరుగులు చేశాడు. ఇక ఈ మూడు ఫిఫ్టీల్లో రెండుసార్లు 15 బంతుల్లోనే చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. తాను క్రికెటర్ అవ్వడానికి టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ కారణమని చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ ఆట చూసిన తర్వాతనే తాను క్రికెట్ ఆడటం మెుదలుపెట్టానని ఫ్రేజర్ తెలిపాడు. దీకాక తన రూమ్ నిండా కోహ్లీ ఫొటోలతో నిండిపోయిందని, అతడే తనకు స్ఫూర్తి అని, క్రికెట్ లో విరాట్ ఓ దిగ్గజం అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. ఆస్ట్రేలియా లీగ్ క్రికెట్ లో సత్తాచాటిన ఫ్రేజర్ అక్కడి టీ20 లీగ్ లో మెరుపు సెంచరీ చేశాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి అతడిపై పడింది. అంతే.. అక్కడి నుంచి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి కింగ్ విరాట్ కోహ్లీ తనకు స్ఫూర్తి అన్న జేక్ ఫ్రేజర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by cricket memes (@the.cricketmemes8)