iDreamPost
android-app
ios-app

Jake Fraser-McGurk: బుమ్రా బౌలింగ్ లో దంచి కొట్టడానికి కారణం అదే.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన జేక్ ఫ్రేజర్!

  • Published Apr 28, 2024 | 11:36 AM Updated Updated Apr 28, 2024 | 11:36 AM

వరల్డ్ క్లాస్ డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో సైతం దంచికొట్టాడు జేక్ ఫ్రేజర్. బుమ్రా బౌలింగ్ ను ఇంత సమర్థవంతంగా ఎదుర్కొవడానికి రీజన్ ఏంటో చెప్పాడు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని పేర్కొన్నాడు.

వరల్డ్ క్లాస్ డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో సైతం దంచికొట్టాడు జేక్ ఫ్రేజర్. బుమ్రా బౌలింగ్ ను ఇంత సమర్థవంతంగా ఎదుర్కొవడానికి రీజన్ ఏంటో చెప్పాడు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని పేర్కొన్నాడు.

Jake Fraser-McGurk: బుమ్రా బౌలింగ్ లో దంచి కొట్టడానికి కారణం అదే.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన జేక్ ఫ్రేజర్!

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ పేరు మారుమోగిపోతోంది. లేట్ గా వచ్చినా గానీ లేటెస్ట్ గా పరుగులు చేస్తున్నాడు ఈ చిచ్చరపిడుగు. ఇప్పటికే ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు అర్ధశతకాలతో చెలరేగాడు. అందులో రెండు ఫిఫ్టీలు కేవలం 15 బంతుల్లోనే సాధించడం విశేషం. ఇక తాజాగా ముంబై బౌలింగ్ ను చిత్తు చేస్తూ.. కేవలం 27 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. అయితే వరల్డ్ క్లాస్ డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో సైతం దంచికొట్టాడు జేక్ ఫ్రేజర్. బుమ్రా బౌలింగ్ ను ఇంత సమర్థవంతంగా ఎదుర్కొవడానికి రీజన్ ఏంటో చెప్పాడు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని పేర్కొన్నాడు.

నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఊచకోతకోస్తూ పరుగుల వరదపారించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తన విధ్వంసకర ఇన్నింగ్స్ కు, బుమ్రా లాంటి డేంజరస్ బౌలర్ బౌలింగ్ లో సైతం దూకుడుగా ఆడటంపై స్పందించాడు. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొవడానికి ప్రధానంగా తాను సన్నద్ధం అయిన తీరును వివరించాడు. తన బ్యాటింగ్ పై సంతృప్తిని వ్యక్తం చేసిన ఫ్రేజర్.. ఈ మ్యాచ్ లో ఇంతలా చెలరేగడానికి తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు.

“వరల్డ్ క్లాస్ డేంజరస్ బౌలర్ అయిన బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్లు కొట్టాలంటే చాలా ధైర్యం కావాలి. అయితే నేను విపరీతంగా బుమ్రా బౌలింగ్ వీడియోలను చూశాను. అతడు వేసే ప్రతీ బంతిని క్షుణ్ణంగా పరిశీలించాను. అది నాకు ఈ మ్యాచ్ లో ఉపయోగపడింది. అందుకే ఈ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో దూకుడుగా ఆడాను. ఇక ఈ ఐపీఎల్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ ను ఎదుర్కొవడానికి నాకు అవకాశం దక్కింది. ఈ ఇన్నింగ్స్ తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది” అంటూ తన సక్సెస్ సీక్రెట్ ను బయటపెట్టాడు ఫ్రేజర్. మరి ఫ్రేజర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.