iDreamPost

టీ20 వరల్డ్ కప్.. ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్! ఆసీస్ WC టీమ్ లోకి చిచ్చర పిడుగులు..

టీ20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగాయి. ఆస్ట్రేలియా తన టీమ్ లోకి ఇద్దరు విధ్వంసకారులను తీసుకోబోతున్నట్లు సమాచారం. అందులో ఒకరు ఇప్పటికే ఈ ఐపీఎల్ సీజన్ లో పెను విధ్వంసం సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ మోగాయి. ఆస్ట్రేలియా తన టీమ్ లోకి ఇద్దరు విధ్వంసకారులను తీసుకోబోతున్నట్లు సమాచారం. అందులో ఒకరు ఇప్పటికే ఈ ఐపీఎల్ సీజన్ లో పెను విధ్వంసం సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్.. ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్! ఆసీస్ WC టీమ్ లోకి చిచ్చర పిడుగులు..

టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే ఉంది. 20 జట్లు పాల్గొనే ఈ మహా సంగ్రామంలో ఏ టీమ్ పొట్టి కప్ ను సొంతం చేసుకుంటుందా? అని అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రపంచ కప్ కోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాయి. అయితే మే 25 వరకు టీమ్స్ కు ప్లేయర్లను చేర్చుకునేందుకు ఛాన్స్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రత్యర్థులకు వణుకు పుట్టించే ఇద్దరు డేంజరస్ ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ఆ ప్లేయర్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ కోసం మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆస్ట్రేలియా టీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులోకి సీనియర్లతో పాటుగా జూనియర్లను కూడా తీసుకున్నారు. అయితే మే 25 వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో.. ఓ ఇద్దరు చిచ్చర పిడుగులను టీమ్ లోకి తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోందట. అందులో ఓ విధ్వంసకర ప్లేయర్ ఈ ఐపీఎల్ లో దుమ్మురేపాడు. అతడే జేక్ ఫ్రేజర్. ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ తరఫున ఓపెనర్ గా దిగి, ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించాడో తెలియనిది కాదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగితూ.. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించాడు.

ఈ సీజన్ లో 9 మ్యాచ్ ల్లో 330 పరుగులు చేశాడు జేక్ ఫ్రేజర్. తొలి ఓవర్లలో భారీ షాట్లతో బౌలర్లపై ఒత్తిడి తేవడంలో సిద్ధహస్తుడు జేక్ ఫ్రేజర్.  ఇతడితో పాటుగా మ్యాథ్యూ షార్ట్ ను సైతం ట్రావెలింగ్ రిజర్వ్ కింద జట్టులోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. షార్ట్ సైతం టీ20లకు సరిపోయే ఆటగాడే. 9 టీ20ల్లో 175 స్ట్రైక్ రేట్ ను కలిగి ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరు జట్టులోకి రానున్నారన్న వార్తలు రావడంతో ప్రత్యర్థి జట్లకు డేంజర్ బెల్స్ వెళ్లాయి. మరి ఆస్ట్రేలియా జట్టులోకి జేక్ ఫ్రేజర్, మాథ్యూ షార్ట్ తీసుకుంటుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

మిచెల్ మార్ష్ (c), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (WK), గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (wk), డేవిడ్ వార్నర్ , ఆడమ్ జంపా.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి