తప్పించుకుంటుంటే నన్ను పట్టించాడు! జడేజా సంగతి చూసుకుంటా: పాండ్యా

తప్పించుకుంటుంటే నన్ను పట్టించాడు! జడేజా సంగతి చూసుకుంటా: పాండ్యా

Ravindra Jadeja, Hardik Pandya, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో బిజీగా ఉన్నారు జడేజా, హార్ధిక్‌ పాండ్యా. అయినా కూడా.. జడేజా సంగతి చూస్తా అంటూ ట్వీట్‌ చేశాడు హార్ధిక్‌ పాండ్యా. మరి ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

Ravindra Jadeja, Hardik Pandya, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌తో బిజీగా ఉన్నారు జడేజా, హార్ధిక్‌ పాండ్యా. అయినా కూడా.. జడేజా సంగతి చూస్తా అంటూ ట్వీట్‌ చేశాడు హార్ధిక్‌ పాండ్యా. మరి ఆ గొడవేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ ప్రారంభమైపోయింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కూడా ముగిసిపోయాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఈ నెల 5న ఐర్లాండ్‌తో ఆడి.. పొట్టి ప్రపంచ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. ప్రస్తుతం టీమిండియా ఫోకస్‌ మొత్తం వరల్డ్‌ కప్‌పైనే ఉంది. భారత ఆటగాళ్లు హార్ధిక్‌ పాండ్యా, జడేజా కూడా వరల్డ్‌ కప్‌తోనే బీజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జడేజా సంగతేంటో చూస్తానంటూ హార్ధిక్‌ పాండ్యా ఒక ట్వీట్‌ చేశాడు. మరి వీరిద్దరి మధ్య గొడవేంటి? ఎందుకు జడేజాపై పాండ్యా అంత కోపంగా ఉన్నాడు. ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

‘నేను నిదానంగా తప్పించుకుంటుంటే.. జడేజా నన్ను పట్టించాడు. అతని సంగతి చూసుకుంటా’ అని తాజాగా పాండ్యా ట్వీట్‌ చేశాడు. అయితే.. ఇది నిజంగా జడేజాపై కోపమేనా అంటే కాదు. ఒక యాడ్‌లో భాగంగా హార్ధిక్‌ పాండ్యా తప్పించుకుంటుంటే.. జడేజా పాండ్యాను పట్టిస్తాడు. ఆ యాడ్‌ను తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన పాండ్యా పైన చెప్పుకున్న క్యాప్షన్‌ను జోడించాడు. ఈ యాడ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. టీమిండియా ప్రధాన స్పాన్సర్‌ డ్రీమ్‌ ఎవెలన్‌కు సంబంధించిన యాడ్‌లో హార్ధిక్‌ పాండ్యా, జడేజా, జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు మరికొంత మంది క్రికెటర్లు కూడా నటించారు. ఆ యాడ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు అందర్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక యాడ్‌ సంగతి పక్కనపెడితే.. టీమిండియా ముందున్న ప్రధాన లక్ష్యం టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలవడం. వన్డే వరల్డ్‌ కప్‌ 2023ను ఒక్క మ్యాచ్‌తో మిస్‌ చేసుకున్న టీమిండియా ఈ సారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలని భావిస్తోంది. ఎలాగైన కప్పు కొట్టాలని బలంగా ఫిక్స్‌ అయింది. పైగా విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి మ్యాచ్‌ విన్నర్లు ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించారు. వీరు కూడా వీరి స్థాయి ఫామ్‌ అందుకుంటే.. టీమిండియాను అడ్డుకోవడం అంత ఈజీగా కాదు. టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా విజయావకాశాలతో పాటు, జడేజా-పాండ్యా యాడ్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments