Nidhan
Ishant Sharma, Ricky Ponting, IND vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కంగారూలను విజయాల బాటలో నడిపిస్తున్న లెజెండ్ రికీ పాంటింగ్‌కు భయం ఏంటో రుచి చూపించాడో భారత బౌలర్.
Ishant Sharma, Ricky Ponting, IND vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కంగారూలను విజయాల బాటలో నడిపిస్తున్న లెజెండ్ రికీ పాంటింగ్‌కు భయం ఏంటో రుచి చూపించాడో భారత బౌలర్.
Nidhan
రికీ పాంటింగ్.. ఈ పేరు వింటేనే అప్పట్లో అపోజిషన్ టీమ్స్ వణికిపోయేవి. 1990వ దశకం చివరి నుంచి 2000వ దశకం ఆఖరి వరకు ఓ పదేళ్ల పాటు అతడి హవా నడిచింది. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతడు ఎంతో దూకుడుగా ఉండేవాడు. కెప్టెన్‌గా ఫుల్ డామినేషన్ చూపించేవాడు. బ్యాట్ పట్టుకొని క్రీజులోకి దిగాడా.. బౌలర్లపై అటాకింగ్ చేస్తూ మ్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో లాక్కునేవాడు. అందుకే చాలా టీమ్స్‌కు అతడో విలన్లా కనిపించేవాడు. అతడితో పెట్టుకోవాలంటేనే అందరూ భయపడేవారు. పాంటింగ్‌కు బౌలింగ్ చేయాలంటేనే అపోజిషన్ టీమ్ బౌలర్లు వణికిపోయేవారు. అలాంటోడ్ని ఓ భారత బౌలర్ ఫస్ట్ టైమ్ భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు. అందర్నీ భయపెట్టినోడ్ని వణికించాడు. పాంటింగ్ పొగరును అణిచాడు. ఇది జరిగి 16 ఏళ్లు కావొస్తోంది.
భయం అంటే ఏంటో తెలియని పాంటింగ్‌కు దాని రుచి చూపించాడు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ. అది 2008వ సంవత్సరం. భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్. వాకా స్టేడియంలో మ్యాచ్. భారత్‌ను మడతబెట్టాలని ఆసీస్ డిసైడ్ అయింది. కానీ మన జట్టును చిత్తు చేయాలని అనుకున్న పాంటింగ్‌కు 17 ఏళ్ల ఇషాంత్ చుక్కలు చూపించాడు. నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో ముచ్చెమటలు పట్టించాడు. 140 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ పాంటింగ్‌కు పోయించాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ క్రీజులో నిలబడాలంటేనే వణికిపోయేలా చేశాడు ఇషాంత్. ఇన్‌స్వింగర్లను ఆడటంలో ఆసీస్ సారథికి ఉన్న వీక్నెస్ను టార్గెట్ చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు.
పాంటింగ్ కాళ్లను టార్గెట్ చేసుకొని వరుసగా ఇన్స్వింగర్లు వేస్తూ ఇబ్బంది పెట్టిన ఇషాంత్.. ఆ తర్వాత ఔట్ స్వింగర్లతో అతడ్ని మరింత కన్ఫ్యూజ్ చేశాడు. అతడి ధాటిని తట్టుకోలేక అతడు వణికిపోయాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాంటింగ్‌ను ఇషాంతే ఔట్ చేయడం విశేషం. ఆ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అప్పటివరకు ఎదురులేని బ్యాటింగ్‌తో హవా నడిపించిన పాంటింగ్‌కు ఇషాంత్ భయం పట్టుకుంది. ఆ మ్యాచ్‌తో పాటు ఇంకా చాలా సిరీస్‌ల్లో ఆసీస్ లెజెండ్‌ను భారత స్పీడ్‌స్టర్ భయపెట్టాడు. పాంటింగ్ బ్యాటింగ్‌కు రాగానే ఇషాంత్ చేతికి బాల్ ఇచ్చేవాళ్లు. ఒక వెలుగు వెలిగిన కంగారూ దిగ్గజం తన కెరీర్ ఆఖరి రోజుల్లో ఇషాంత్‌ను ఎదుర్కోలేక చతికిలపడ్డాడు. మహా మహా బౌలర్లను బాదినోడు భారత పేసర్ దెబ్బకు పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపర్చాడు. అందుకే అటు పాంటింగ్, ఆసీస్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు భారత అభిమానులు కూడా ఇషాంత్ సూపర్ స్పెల్‌ను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇవాళ అతడి బర్త్ డే కావడంతో మరోమారు ఆ స్పెల్ గురించి డిస్కస్ చేస్తున్నారు.
Enjoy Ishant sharma’s iconic spell to Ricky Ponting
Happy birthday dilli ke londe @ImIshant pic.twitter.com/GOX9J7pwiz
— Navaldeep Singh (@NavalGeekSingh) September 2, 2024