SNP
SNP
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ గొప్ప కెప్టెన్‌లే. కానీ, కెప్టెన్‌గా ధోని ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కోహ్లీకి అవి ఒక్కటే తక్కవైనా.. కెప్టెన్‌గా అతనికి పేరు పేట్టేందుకు ఏం లోపంలేదు. పైగా టెస్టు క్రికెట్‌లో ఇండియన్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్ అతనే. అయితే.. కోహ్లీ కంటే ధోని విజయవంతమైన కెప్టెన్ అనే విషయాన్ని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ మాత్రం తాను ఆడిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ బెస్ట్ కెప్టెన్ అంటూ పేర్కొన్నాడు. కానీ, ఇషాంత్ శర్మ ధోని కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం గమనార్హం.
ధోనికి, కోహ్లీకి కెప్టెన్‌గా ఉన్న తేడాను ఇషాంత్ శర్మ వివరిస్తూ.. ‘నేను చాలా అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు ధోని.. తనను కామ్‌గా ఉండాలని, ఒకవేళ నాపై నిషేధం విధిస్తే.. బౌలింగ్ ఎవరు చేస్తారు అనే వాడు, కానీ, కోహ్లీ అలా కాదు.. ఒక్క బ్యాన్ పడకుండా నువ్వేం చేసినా నేను చూసుకుంటా.. అని అనేవాడు. అది ధోనికి, కోహ్లికి ఉన్న తేడా’ అని అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో తాను ఎక్కువగా విదేశాల్లోనే మ్యాచ్‌లు ఆడాడని, స్వదేశంలో ఆడిన మ్యాచ్‌లు చాలా తక్కవని ఇషాంత్ చెప్పుకోచ్చాడు. ధోని కెప్టెన్సీలో ఇషాంత్ శర్మ 47 టెస్టులు ఆడాడు.
ఇక విరాట్ కోహ్లీ బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అనేందుకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. 2014 నుంచి 2022 వరకు టెస్టుల్లో కోహ్లి భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన హయాంలో టీమిండియా 68 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది, అందులో 40 మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది. అలాగే కెప్టెన్‌గా కోహ్లీ 68 మ్యాచ్‌ల్లో 113 ఇన్నింగ్స్‌లలో 54.80 సగటుతో 5864 పరుగులు చేశాడు. అందులో 20 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత రికార్డులను పక్కనపెడితే.. జట్టను నడిపించే విధానంలో కోహ్లీ.. సౌరవ్ గంగూలీని తలపించాడు. టీమ్‌ను చాలా అగ్రెసివ్‌గా ఉంచేవాడు. అప్పటి వరకు ధోని కెప్టెన్సీలో కామ్ అండ్ కూల్‌గా ఆడిన టీమిండియా.. కోహ్లీ కెప్టెన్సీలో జూలువిదిల్చిన సింహంలా టెస్టుల్లో ఆడింది. అందుకే ఇషాంత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ బెస్ట్ కెప్టెన్ అని పేర్కొన్నాడు. మరి అతని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ishant Sharma said “Virat Kohli is the Best Captain I have played under”. [JioCinema] pic.twitter.com/q3OeCcf948
— Johns. (@CricCrazyJohns) August 15, 2023
ఇదీ చదవండి: షాకింగ్: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగా